Akshaya Tritiya: సెంటిమెంట్ సరే... ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?

Akshaya Tritiya 2019 | అక్షయ తృతీయ నాడు బంగారాన్ని సరైన సమయంలో కొని, అమ్మితే మంచి లాభాలు పొందొచ్చు. రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే మీ పెట్టుబడుల్ని ఈక్విటీ, డెట్, గోల్డ్‌కు కేటాయించాలి.

news18-telugu
Updated: May 7, 2019, 1:17 PM IST
Akshaya Tritiya: సెంటిమెంట్ సరే... ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
Akshaya Tritiya: సెంటిమెంట్ సరే... ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దేశమంతా అక్షయ తృతీయ సందడే. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిదని చాలామంది నమ్మకం. అందుకే ఈ రోజున ఎంతోకొంత బంగారం కొంటుంటారు. ఎంత సెంటిమెంట్ గురించి ఆలోచించినా ఈ సమయంలో బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా అన్న డైలమా చాలామందిలో ఉంటుంది. కానీ... బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఈ అక్షయ తృతీయ మంచి సందర్భం అని Moneycontrol కథనం. ప్రపంచ వాణిజ్య ముఖచిత్రం మారుతుండటంతో భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ పరిశీలిస్తే ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ సంబంధాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. టారిఫ్ వార్ మొదలైంది. స్వదేశీ వస్తు రక్షణ విధానంతో ప్రపంచ వృద్ధి నెమ్మగిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం లాంటి అంతర్జాతీయ పరిణామాలతో భారతీయ ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు.

బంగారం ధరలు అందుబాటులో ఉండటం, ఈసారి వర్షాలు బాగా కురిసే అవకాశం కనిపిస్తుండటంతో గతేడాది కన్నా ఈసారి బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. గతేడాది 760 టన్నులు అమ్ముడుపోతే 2019లో 850 టన్నుల డిమాండ్ ఉండొచ్చని అంచనా.
సోమసుందరం, ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్, వాల్డ్ గోల్డ్ కౌన్సిల్


ఇక గత ఐదేళ్లలో బంగారం ధరలు చూస్తే ఆశించినంత పెరగలేదు. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఐదేళ్లలో 0.25% రిటర్న్స్ మాత్రమే వచ్చాయి. అయితే భారతీయుల్లో ఎక్కువగా బంగారాన్ని పెట్టుబడిగా చూడటానికి ఇష్టపడరు. అయితే ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని సరైన సమయంలో కొని, అమ్మితే మంచి లాభాలు పొందొచ్చు. రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే మీ పెట్టుబడుల్ని ఈక్విటీ, డెట్, గోల్డ్‌కు కేటాయించాలి.



మీ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి 5% నుంచి 10% కేటాయించాలి. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నగలు కొనడం అనేది వ్యక్తిగతం. అయితే నగలపై ఇన్వెస్ట్ చేయడం అనేది బ్యాడ్ ఛాయిస్. ఎందుకంటే నగలు కొంటే నాణ్యత, మేకింగ్ ఛార్జీలు, భద్రపర్చుకోవడం లాంటి అంశాలుంటాయి.
కిరణ్ తెలంగ్, ధనాయుష్ క్యాపిడల్ అడ్వైజర్స్ కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్


మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. డీమ్యాట్ అకౌంట్ ఉంటే సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని కూడా ట్రేడ్ చేయొచ్చు. ఏటా మీకు 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే బంగారం కొనేముందు వాటి ఒకసారి మార్కెట్ స్టడీ చేయడం మంచిది.
Loading...
Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్

ఇవి కూడా చదవండి:

Akshaya Tritiya: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ATM Services: ఏటీఎం నుంచి మరిన్ని ఉచిత సేవలు... ఇలా పొందండి

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...