హోమ్ /వార్తలు /బిజినెస్ /

Akasa Air: విమానయాన రంగంలోకి "ఆకాశ ఎయిర్ ".. తక్కువ ధరలో టికెట్లు.. ఎప్పటి నుంచి అంటే !

Akasa Air: విమానయాన రంగంలోకి "ఆకాశ ఎయిర్ ".. తక్కువ ధరలో టికెట్లు.. ఎప్పటి నుంచి అంటే !

విమానయాన రంగంలోకి "ఆకాశ ఎయిర్ ".. తక్కువ ధరలో టికెట్లు.. ఎప్పటినుంచంటే !

విమానయాన రంగంలోకి "ఆకాశ ఎయిర్ ".. తక్కువ ధరలో టికెట్లు.. ఎప్పటినుంచంటే !

దిగ్గజ ఇండియన్ స్టాక్ ట్రేడర్, ఇండియన్ బిగ్ బుల్ రాకేష్ ఝున్‌జున్‌వాలా ఎయిర్‌లైన్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఆయన ‘అకాశ ఎయిర్’ పేరుతో ఎయిర్‌లైన్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ సేవలు ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ జులై 22 నుంచి ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభించింది

ఇంకా చదవండి ...

దిగ్గజ ఇండియన్ స్టాక్ ట్రేడర్, ఇండియన్ బిగ్ బుల్ రాకేష్ ఝున్‌జున్‌వాలా ఎయిర్‌లైన్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఆయన ‘అకాశ ఎయిర్’ పేరుతో ఎయిర్‌లైన్(Airlines) కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ సేవలు ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ జులై 22 నుంచి ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతానికి అహ్మదాబాద్- బెంగళూరుతో పాటు ముంబై(Mumbai)- కొచ్చి మధ్య విమానాల రాకపోకల కోసం ఫ్టైట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఈ కొత్త ఎయిర్‌లైన్ కంపెనీ భారత్‌లో ఆగస్టు 7 నుంచి సేవలను ప్రారంభించనుంది. ప్రారంభ దశలో ముంబై, అహ్మదాబాద్ మధ్య 28 వీక్లీ ఫ్లైట్స్ సేవలను అందించి, కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఆగస్టు 13 నుంచి బెంగుళూరు, కొచ్చి మధ్య 28 వీక్లీ ఫ్లైట్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆకాశ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రూట్స్‌లో ఫ్లైట్ జర్నీ కోసం చూసేవారు జులై 22 నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

ముంబై, అహ్మదాబాద్ రూట్‌లో..

షెడ్యూల్‌లో భాగంగా అకాశ ఎయిర్ ముంబై- అహ్మదాబాద్ డైలీ ఫ్లైట్.. ఉదయం 10.05 IST వద్ద ముంబై నుంచి బయలుదేరుతుంది. బుధవారం మినహా ప్రతి రోజు ఈ రూట్ ఫ్లైట్ ఉంటుంది. అహ్మదాబాద్ నుంచి రిటర్న్ ఫ్లైట్ 12.05 IST వద్ద ప్రారంభమవుతుంది. ముంబయి నుంచి విమాన టికెట్ల ధర రూ. 4,314 నుంచి ప్రారంభం కాగా, అహ్మదాబాద్ నుంచి వచ్చేవారికి టికెట్ ప్రారంభ ధర రూ. 3,906గా ఉంది.

ఇదీ చదవండి: china-India tension: మిసైల్ పరీక్ష తో మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్ దిమ్మతిరిగే సమాధానం..



ఈ సంస్థ ముంబై, అహ్మదాబాద్ మధ్య మరో డైలీ ఫ్లైట్‌ కూడా నడుపుతుంది. అది ముంబై నుంచి 14.05 IST గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అహ్మదాబాద్ నుంచి 16.05 IST వద్ద ముంబైకి టేకాఫ్ అవుతుంది. ముంబై నుంచి విమాన టికెట్ల ధర రూ. 3,948 నుంచి ప్రారంభం కాగా, అహ్మదాబాద్ నుంచి టికెట్ ప్రారంభ ధర రూ. 5,008.

బెంగళూరు, కొచ్చి రూట్‌లో..

అలాగే ఆకాశ ఎయిర్‌లైన్ బెంగళూరు (Bengaluru)నుంచి కొచ్చికి 07.15 IST, 11.00 IST టైమ్‌కు రెండు డైలీ ఫ్లైట్స్ నడుపుతుంది. టికెట్ల ధరలు రూ. 3,483 నుంచి ప్రారంభమవుతాయి. కొచ్చి నుంచి తిరిగి వచ్చే రిటర్న్ ఫ్లైట్స్ టైమింగ్స్ 09.05 IST, 13.10 IST. టికెట్ల ధరలు రూ. 3,282 నుంచి ప్రారంభమవుతాయి.

ఆకాశ ఎయిర్ మొబైల్ యాప్, www.akasaair.com వెబ్‌సైట్ ద్వారా బుకింగ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా బుకింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్‌లైన్ కంపెనీ కొత్తగా కొనుగోలు చేసిన బోయింగ్ 737 MAX విమానాలను అన్ని రూట్‌లలో ఉపయోగిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి కొత్త సెక్టార్‌లోకి ప్రవేశించి, తక్కువ ఛార్జీలతో సేవలు అందిచాలని ప్లాన్ చేస్తోంది. పాన్-ఇండియా సేవలతో బలమైన కంపెనీగా ఎదిగి, దేశంలోని మెట్రో, టైర్ 2, టైర్ 3 నగరాలకు కమ్యూటింగ్ సేవలను అందించడంపై ఆకాశ ఎయిర్‌లైన్స్ దృష్టి సారించింది.

First published:

Tags: Air India, Airlines, Bengaluru, Rakesh Jhunjhunwala

ఉత్తమ కథలు