Destination Wedding Planning: జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం పెళ్లి. ఈ వేడుకను చాలా అద్భుతంగా నిర్వహించాలని వధూవరులు ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజుల్లో బ్యూటిఫుల్ ప్లేసెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) ప్లాన్ చేయడం కామన్ అయిపోయింది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్‌లో భాగంగా వధూవరులు కేవలం బంధుమిత్రులు మాత్రమే తీసుకెళ్తారు. అయితే ఈ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం చాలా ఖరీదుతో కూడుకున్నది. అయితే ఈ ఖర్చులను తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇండియాలో బెస్ట్ ప్లేసెస్
డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అద్భుతమైన ప్రదేశాలు భారతదేశమంతటా ఉన్నాయి. హిల్స్ స్టేషన్‌లోని హోటల్, బీచ్‌లో రిసార్ట్ లేదా ఫైవ్ స్టార్‌లో సిటీ వెడ్డింగ్ వంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే రాయల్ పాలస్ వంటి పాపులర్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లేసెస్ మరింత ప్రియంగా మారాయి. అందువల్ల ముస్సోరి, రిషికేశ్, కేరళ , నాగాలాండ్, రాజస్థాన్‌లోని ఖిమ్సర్, మేఘాలయలోని షిల్లాంగ్ వంటి కొత్త, తక్కువ పాపులర్ అయిన ప్రదేశాలలో వెడ్డింగ్ ప్లాన్ చేయడం బెటర్. జైపూర్‌లోని ప్యాలెస్‌లో 150 మంది అతిథుల వరకు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అంచనా వ్యయం రూ.50-70 లక్షలు అవుతుంది. అదే రిషికేశ్‌లోని హోటల్లో పెళ్లికి రూ.40-50 లక్షలు ఖర్చవుతుంది. సో, ఎంచుకునే ప్లేస్ అందంగా, అదేవిధంగా భిన్నంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత స్వస్థలాలకు సమీపంలో ఉన్న ప్రదేశాలను ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. అలానే డెస్టినేషన్‌కి సులభంగా వెళ్లగలమా లేదా అనేది కూడా తెలుసుకోవాలి.
బడ్జెట్‌ను తగ్గించడానికి టిప్స్
డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేసేటప్పుడు వేదిక ఖర్చులు మాత్రమే కాకుండా అతిథులు, వధూవరుల కుటుంబాలు, ఫొటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, ఇతరుల బస, రవాణా ఖర్చుల గురించి లెక్కించాలి. ఫిజికల్ ఇన్విటేషన్స్ కాకుండా డిజిటల్ ఇన్విటేషన్స్‌తో ఖర్చులు తగ్గించుకోవచ్చు. మెహందీ, హల్దీ వంటి చిన్న ఫంక్షన్లను తక్కువ ఖర్చుతో జరుపుకోవచ్చు. వెడ్డింగ్ వెండర్లకు బదులుగా, హోమ్ క్యాటరింగ్, డెకర్, ఇతర సేవలను విడివిడిగా బుక్ చేసుకోవడం బెటర్.
Ola Electric: కేవలం 10 నెలల్లో లక్ష స్కూటర్ల మ్యానుఫ్యాక్చరింగ్.. ఓలా ఎలక్ట్రిక్ రికార్డ్..
సేవలను ముందుగానే బుక్ చేసుకోవాలి
మీ సెల్లర్స్ ముందుగానే బుక్ చేసుకోవడంతో పాటు, మీరు లోకల్ సేవలను కూడా ఎంచుకోవచ్చు. లోకల్ ఫోటోగ్రాఫర్ లేదా క్యాటరింగ్ సేవలు వంటివి ఎంపిక చేసుకోవడం వల్ల రవాణా, వసతి, లాజిస్టిక్స్ ఖర్చులు ఆదా అవుతాయి. అలానే హిడెన్ ఛార్జీల, ఓవర్ కాస్ట్స్ గురించి కూడా ముందుగానే తెలుసుకోవడం మంచిది. అలానే డిస్కౌంట్స్ ఇంకా ఏవైనా ఫ్రీబీల గురించి తెలుసుకోవాలి.
ఆహ్వానం ముఖ్యమైన వారికే
అతిథుల సంఖ్య పెరిగే కొద్దీ మీ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ రెండు కుటుంబాలను జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబం, స్నేహితులు, సహోద్యోగుల కోసం రిసెప్షన్‌ను నిర్వహించవచ్చు కాబట్టి అత్యంత ముఖ్యమైన వారిని డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఆహ్వానించాలి. అత్యంత శుభప్రదమైన వివాహ ముహూర్తాలలో బుకింగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల అన్ని ఖర్చులు పెరగొచ్చు. ఒకవేళ తేదీని పట్టించుకోని వారైతే వేరే శుభప్రదమైన తేదీలలో తమ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.