హోమ్ /వార్తలు /బిజినెస్ /

Airtel , Jio, VI అందిస్తున్న చౌకైన Postpaid ప్లాన్ ఇదే.. ఈ ప్లాన్ ప్రయోజనాలను తెలుసుకోండి

Airtel , Jio, VI అందిస్తున్న చౌకైన Postpaid ప్లాన్ ఇదే.. ఈ ప్లాన్ ప్రయోజనాలను తెలుసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఇటీవలే Postpaid సేవలను ప్రారంభించిన రిలయన్స్ Jio Postpaid ప్లస్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో అపరిమిత కాలింగ్, డేటా, OTT Subscription , డేటా రోల్‌ఓవర్, ఉచిత అంతర్జాతీయ రోమింగ్ వంటి ఎన్నో సేవలను అందిస్తుంది.

భారతీయ మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువగా వాడే Airtel, రిలయన్స్ Jio, వొడాఫోన్–ఐడియా మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే Airtel, వొడాఫోన్, ఐడియాలు ఇదివరకే Postpaid సేవలు అందిస్తున్నప్పటికీ, Jio మాత్రం Postpaid సేవల్లో అడుగుపెట్టలేదు. కాగా, ఇటీవలే Postpaid సేవలను ప్రారంభించిన రిలయన్స్ Jio Postpaid ప్లస్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో అపరిమిత కాలింగ్, డేటా, OTT Subscription , డేటా రోల్‌ఓవర్, ఉచిత అంతర్జాతీయ రోమింగ్ వంటి ఎన్నో సేవలను అందిస్తుంది. ఈ మూడు టెలికం ఆపరేటర్లు రూ .399తో Postpaid ప్లాన్‌లను అందిస్తున్నాయి. Postpaid వినియోగదారులకు అందిస్తున్న అత్యంత చౌకైన ప్లాన్ గా దీన్ని పేర్కొనవచ్చు. కాగా, రిలయన్స్ Jio, Airtel, VIఅందిస్తున్న ఈ చౌకైన Postpaid ప్లాన్ ప్రయోజనాలను తెలుసుకుందాం.

రిలయన్స్ Jio రూ.399 Postpaid ప్లాన్

రూ .339తో వచ్చే రిలయన్స్ Jio ‘Postpaid ప్లస్’ ప్లాన్ నెలరోజుల పాటు అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలను అందిస్తుంది. 200GB వరకు డేటా రోల్‌ఓవర్‌తో 75GB హై-స్పీడ్ 4జీ డేటాను అందిస్తుంది. దీనికి మించి డేటాను వాడాలంటే మాత్రం వినియోగదారులు ప్రతి జిబికి రూ .10 చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు Jio యాప్స్, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని ఈ ప్లాన్లో పొందుపర్చింది.

Airtel  రూ .399 Postpaid ప్లాన్

Airtel  రూ. 399 Postpaid ప్లాన్‌లో 40 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ ఎస్‌ఎంఎస్, ఇన్ హౌజ్ OTT సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ ప్లాన్లో ప్రముఖ OTT Subscription ను మాత్రం అందించలేదు.

VI రూ. 399 Postpaid ప్లాన్

‘వీఐ’ పేరుతో వొడాఫోన్ Airtel ఇటీవలే ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ రెండూ కలిసి ప్రీపెయిడ్ తో పాటు పోస్ట్ పెయిడ్ సేవలను ప్రారంభించాయి. దీనిలో భాగంగా ప్రారంభించిన రూ. 399 Postpaid ప్లాన్ Airtel Postpaid ప్లాన్ వలె ఉంటుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలను అందిస్తుంది. అంతేకాక, 200GB వరకు డేటా రోల్‌ఓవర్‌తో 40GB హై-స్పీడ్ 4జీ డేటాను అందిస్తుంది. అయితే, దీనిలో ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్ లో Subscription  లేకపోవడం నిరాశ కలిగించే అంశం.

Published by:Krishna Adithya
First published:

Tags: AIRTEL, Jio, Vodafone Idea

ఉత్తమ కథలు