Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్... 2 రోజులు మాత్రమే

Airtel | ఎయిర్‌టెల్ యూజర్లకు ఆఫర్లను అందించేందుకు ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారతీ ఎయిర్‌టెల్.

news18-telugu
Updated: January 17, 2020, 5:01 PM IST
Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్... 2 రోజులు మాత్రమే
Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్... 2 రోజులు మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు ఎయిర్‌టెల్ నెట్వర్క్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. 'ఎయిర్‌టెల్ థ్యాంక్స్' కార్యక్రమంలో భాగంగా కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది ఎయిర్‌టెల్. బిగ్ బజార్ నిర్వహించబోయే అతిపెద్ద షాపింగ్ బొనాంజా 'సబ్‌సే సస్తే 5 దిన్' సేల్‌లో ఎయిర్‌టెల్ కస్టమర్లు అదనపు లాభాలను పొందొచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లకు ఆఫర్లను అందించేందుకు ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారతీ ఎయిర్‌టెల్. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ఉపయోగిస్తున్న 'ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్స్' రెండు రోజుల ముందుగానే బిగ్ బజార్ 'సబ్‌సే సస్తే 5 దిన్' సేల్ ఆఫర్లను పొందొచ్చు.

బిగ్‌ బజార్ 'సబ్‌సే సస్తే 5 దిన్' షాపింగ్ బొనాంజా జనవరి 22 నుంచి 26 వరకు జరుగుతుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్లు మాత్రం రెండు రోజుల ముందుగానే అంటే జనవరి 20, 21 తేదీల్లోనే ఈ ఆఫర్లను పొందొచ్చు. ఎర్లీ యాక్సెస్‌తో పాటు ఫాస్ట్ బిల్లింగ్ కూడా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్లకు లభిస్తుంది. ఫ్యూచర్ పే యాప్ డౌన్‌లోడ్ చేసి మొదటిసారి ఉపయోగించేవారికి రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ప్రయోజనాలు పొందాలంటే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్లు https://www.bigbazaar.com/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. స్టోర్ లొకేషన్, సమయం లాంటి వివరాలు ఎంటర్ చేస్తే పాస్ ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఇమెయిల్‌లో వస్తుంది.

ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్



LIC Home Loan offer: హోమ్ లోన్ తీసుకునేవారికి ఎల్ఐసీ అద్భుతమైన ఆఫర్స్

Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 17 యాప్స్ ఉంటే రిస్కే
First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు