ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ పరిమితి ఎత్తివేత..

టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ ఔట్ గోయింగ్ కాల్స్‌పై ఇటీవల విధించిన పరిమితిని ఎత్తివేసింది.

news18-telugu
Updated: December 7, 2019, 10:28 PM IST
ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ పరిమితి ఎత్తివేత..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ ఔట్ గోయింగ్ కాల్స్‌పై ఇటీవల విధించిన పరిమితిని ఎత్తివేసింది.గతంలో ఉన్న ప్రీపెయిడ్ టారిఫ్స్‌ను పెంచిన ఎయిర్‌టెల్.. ఔట్ గోయింగ్ కాల్స్‌పై కూడా పరిమితి విధించింది.28రోజుల వాలిడిటీ ప్లాన్‌పై 1000 నిమిషాలు,84 రోజుల వాలిడిటీ ప్లాన్‌పై 3000 నిమిషాలు,365 రోజుల వాలిడిటీపై 12000 నిమిషాల పరిమితి విధించింది. ఆ పరిమితి దాటితే ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6పైసలు చార్జీ ఉంటుంది.డిసెంబర్ 1న ప్రకటించిన ఈ టారిఫ్స్‌లో ఔట్ గోయింగ్ పరిమితిపై కంపెనీ పున:సమీక్షించింది. ఆదివారం నుంచి ఔట్ గోయింగ్ కాల్స్‌పై ఇక ఎటువంటి పరిమితి ఉండదని ప్రకటించింది. అన్‌లిమిటెడ్ ఔట్ గోయింగ్ కాల్స్ మాట్లాడుకోవచ్చునని తెలిపింది.కాగా, నష్టాల నుంచి గట్టెక్కడానికి ఎయిర్‌టెల్‌తో పాటు వొడాఫోన్,జియో,ఐడియా కూడా ఇటీవల టారిఫ్స్ పెంచిన సంగతి తెలిసిందే.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>