హోమ్ /వార్తలు /బిజినెస్ /

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Disney+ Hotstar Free Plans | మీరు ఎయిర్‌టెల్ యూజరా? అయితే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త. పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది ఎయిర్‌టెల్. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ ఆఫర్ పొందొచ్చు. గతంలో ప్రీపెయిడ్ యూజర్లకు రూ.401, రూ.612, రూ.1,208, రూ.2,599 రీఛార్జులపై డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ప్రకటించింది ఎయిర్‌టెల్. ఇప్పటికీ ఈ ఆఫర్ ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇదే ఆఫర్‌ను పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కూడా ఎయిర్‌టెల్ ప్రకటించింది. రూ.999 కన్నా ఎక్కువ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్, రూ.499 కన్నా ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ తీసుకునేవారు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

  Amazon Gold Voucher: అమెజాన్ గోల్డ్ వోచర్... రూ.500 ఉంటే చాలు గోల్డ్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు

  Business Loan: వ్యాపారానికి అప్పు కావాలా? మోదీ ప్రభుత్వ పథకానికి నవంబర్ 30 లోగా అప్లై చేయండి

  మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆఫర్స్ సెక్షన్‌లో చూస్తే మీకు ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ఆఫర్ కనిపిస్తే డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆఫర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆఫర్ యాక్టివేట్ చేసుకున్న రోజు నుంచి ఏడాది పాటు మీరు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తొలగించినా, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ నిలిపివేసినా, ఇప్పుడు ఉన్న ప్లాన్‌ను తగ్గించినా డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ నిలిచిపోతుంది. అందుకే ఈ ఆఫర్ యాక్టివేట్ చేసేముందు ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో టర్మ్స్ అండ్ కండీషన్స్ తప్పనిసరిగా చదవాలి.

  Gold: ఒక్క రూపాయికే బంగారం... మీరూ కొనండి ఇలా

  SBI Debit Card: ఏటీఎం కార్డు పోయిందా? సింపుల్‌గా బ్లాక్ చేయండిలా

  ఇక ఇప్పటికే రిలయెన్స్ జియో కూడా ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను కాంప్లిమెంటరీగా ఇస్తున్న సంగతి తెలిసిందే. జియోలో రూ.499, రూ.777 ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ లభిస్తుంది. జియోలో ప్రీపెయిడ్ మాత్రమే కాదు పోస్ట్‌పెయిడ్‌లోనూ ఇదే ఆఫర్ ఉంది. జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్స్ తీసుకునేవారికి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌లో రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1499 ప్లాన్స్ ఉన్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్‌స్క్రిప్షన్ డైరెక్ట్‌గా తీసుకోవాలంటే రూ.399 చెల్లించాలి. స్పోర్ట్స్, మల్టీప్లెక్స్ మూవీస్, హాట్‌స్టార్ స్పెషల్స్, స్టార్ సీరియల్స్ లాంటివి చూడొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, Disney+ Hotstar

  ఉత్తమ కథలు