Airtel | ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తీపికబురు అందించింది. మరో కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్ అథంటికేషన్ బేస్డ్ సేవింగ్స్ అకౌంట్ (Bank Account) ఓపెనింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ మరింత సులభతరం కానుంది. ఇలాంటి సర్వీసులు తీసుకువచ్చిన తొలి పేమెంట్స్ బ్యాంక్‌గా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ (Airtel) నిలిచింది.
ఈ కొత్త సదుపాయం ద్వారా బ్యాంక్‌కు చెందిన బిజినెస్ కరస్పాండెట్లు ఈజీగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కస్టమర్ల ఫేస్ అథంటికేషన్ ద్వారా ఇకేవైసీ పూర్తి చేయొచ్చు. తద్వారా బ్యాంక్ అకౌంట్‌ను సులభంగానే తెరవొచ్చు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇటీవల తీసుకువచ్చిన కొత్త మొబైల్ యాప్ ద్వారా ఈ ఇకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. అంటే బిజినెస్ కరస్పాండెట్ల వద్ద కేవలం స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేయగలరు. ఈ ఏడాది చివర కల్లా దేశ్ వ్యాప్తంగా ఉన్న 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లలో ఫేస్ అథంటికేషన్ ఇకేవైసీ సర్వీసులను అందుబాటులో ఉంచుతామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి శుభవార్త!
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో అనుబ్రటా బిస్వాస్ మాట్లాడుతూ.. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో తాము డిజిటల్ సేవలను సరికొత్త సాంకేతికతతో బలోపేతం చేయాలని విశ్వసిస్తున్నామని తెలిపారు. తమ కస్టమర్లకు మెరుగైన డిజిటల్ బ్యాంకింగ్ సేవలను, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ సురక్షితమైన ఫేస్ అథంటికేషన్ సర్వీసులు అనేవి యూఐడీఏఐ ద్వారానే సాధ్యమైందని వివరించారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు లక్ష్యాన్ని ఈ సర్వీసులు మరింత ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు.
ఇచ్చేది గోరంత, పొందేది కొండంత.. బ్యాంకుల తీరిదే!
ఈ ఫేస్ అథంటికేషన్ కేవైసీ విధానంలో ఆర్టిఫీషియల్ లేదా మెషీన్ లెర్నింగ్ ద్వారా కస్టమర్ల ఐడెంటిటీని ధ్రువీకరిస్తారని పేర్కొన్నారు. ఫేస్ అథెంటికేషన్ ఆర్డీ అప్లికేషన్ ద్వారా ఆధార్‌లో క్యాప్చర్ చేసిన ఫోటోతో వ్యక్తి ఫోటోను క్రాస్ చెక్ చేయడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడంలో సహాయపడుతుందని, తద్వారా సురక్షితమైన కస్టమర్ ఆన్‌బోర్డింగ్‌ను అనుమతిస్తుందని వివరించారు.
కాగా ఇప్పటి వరకు చూస్తే.. కస్టమర్లకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతాను తెరవాలనుకుంటే.. ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ అథంటికేషన్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇకపై ఫేస్ అథంటికేషన్ ద్వారా కూడా అకౌంట్ తెరవొచ్చు. కాగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇటీవలనే మైక్రో ఏటీఎం సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Bank account, Banks