Airtel Bharosa Account: రూ.500 మినిమమ్ బ్యాలెన్స్... ఉచితంగా రూ.5 లక్షల ప్రమాద బీమా

Airtel Payments Bank Bharosa Savings Account | భరోసా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన కస్టమర్లు భారతదేశంలోని 6,50,000 ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్-AePS ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: September 17, 2019, 3:27 PM IST
Airtel Bharosa Account: రూ.500 మినిమమ్ బ్యాలెన్స్... ఉచితంగా రూ.5 లక్షల ప్రమాద బీమా
Airtel Bharosa Account: రూ.500 మినిమమ్ బ్యాలెన్స్... ఉచితంగా రూ.5 లక్షల ప్రమాద బీమా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 17, 2019, 3:27 PM IST
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్ సేవల్ని పొందలేకపోతున్నవారికి 'భరోసా సేవింగ్స్ అకౌంట్'ను ప్రకటించింది. 'భరోసా సేవింగ్స్ అకౌంట్'లో నెలకు ఒక డెబిట్ ట్రాన్సాక్షన్‌తో రూ.500 బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలు. రూ.5 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ ఉచితంగా లభిస్తుంది. భరోసా సేవింగ్స్ అకౌంట్‌ ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు పొందే కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. మార్కెట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి 'భరోసా సేవింగ్స్ అకౌంట్' రూపొందించినట్టు చెబుతోంది ఎయిర్‌టెల్. బ్యాంక్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరుపుతూ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకునేలా కస్టమర్లను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది.

భరోసా సేవింగ్స్ అకౌంట్ లాంఛ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపయోగపడేలా రూపొందించిన అకౌంట్ ఇది. భారతదేశ బ్యాంకింగ్ రంగంలో యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ అకౌంట్‌ను ప్రకటిస్తున్నాం. కొన్ని నెలల పాటు పరిశోధనలు జరిపిన తర్వాత లక్షలాది మంది కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు భరోసా సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించాం.
అనుబ్రాతా బిస్వాస్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ & సీఈఓ


భరోసా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన కస్టమర్లు భారతదేశంలోని 6,50,000 ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్-AePS ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు.



Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:
Loading...
Best Smartphones: ఆన్‌లైన్‌ సేల్‌లో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Amazon Sale: సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్... ఆఫర్లు ఇవే

Flipkart: ఫ్లిప్‌కార్ట్ యాప్ ఉందా? ఫ్రీగా సినిమాలు చూడొచ్చు ఇలా
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...