• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • AIRTEL PAYMENTS BANK LAUNCHED DIGIGOLD DIGITAL PLATFORM FOR ITS CUSTOMERS TO MAKE INVESTMENTS IN GOLD NS GH

DigiGold: డిజీగోల్డ్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్.. బంగారంపై ఎలా పెట్టుబడి పెట్టాలంటే..

DigiGold: డిజీగోల్డ్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్.. బంగారంపై ఎలా పెట్టుబడి పెట్టాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్ వినియోగదారులకు సరికొత్త పెట్టుబడి వేదికను ప్రారంభించింది. డిజిటల్ బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు డిజీగోల్డ్‌ను లాంఛ్ చేసింది.

  • Share this:
ఆర్థిక లావాదేవీలను ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారానే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. పెట్టుబడులు కూడా ఆన్ లైన్ ద్వారా పెడుతున్నారు. తాజాగా భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్ వినియోగదారులకు సరికొత్త పెట్టుబడి వేదికను ప్రారంభించింది. డిజిటల్ బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు డిజీగోల్డ్‌ను లాంచ్ చేసింది. సేఫ్ గోల్డ్ భాగస్వామ్యంతో ఈ డిజీగోల్డ్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన విధి విధానాలు, నియమ నిబంధనలను తెలుసుకుందాం.
Akshaya Tritiya 2021: కరోనా కారణంగా ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోతున్నారా? అయితే, ఇంట్లో నుంచే ఒక్క క్లిక్ తో కొనండిలా..

గిఫ్ట్ కార్డులు పంపుకోవచ్చు..
ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్‌లో సేవింగ్ అకౌంట్ ఉన్న వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను ఉపయోగించి 24 క్యారెట్ల బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అవసరమైనప్పుడు అమ్మవచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులకు డిజీగోల్డ్ గిఫ్ట్ కార్డులను కూడా పంపుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. "సేఫ్ గోల్డ్ ద్వారా వినియోగదారులు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వచేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఎలాంటి అదనపు ఖర్చులు ఉండవు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఏ సమయంలోనైనా సులభంగా బంగారాన్ని అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఎంత చిన్న మొత్తమైనా పెట్టుబడిగా పెట్టవచ్చు. కనీస విలువ అంటూ ఏమి లేదు" అని సంస్థ ప్రకటించింది.

సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు..
తాజా పెట్టుబడి వేదిక గురించి ఎయిర్‌టెల్ పేమేంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణేశ్ అనంతరాయన్ మాట్లాడారు. డిజీగోల్డ్ సంస్థ నియో బ్యాంకింగ్ ప్రతిపాదనకు సరళమైన, సురక్షితమైన, విలువ ఆధారిత రూపమని తెలిపారు. వినియోగదారులు తమ యాప్ ద్వారా బంగారంపై సులభంగా పెట్టుపడులు పెట్టవచ్చన్నారు. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడానికి వీలుగా వినియోగదారుల కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సేఫ్ గోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ మాథుర్ సైతం దీనిపై స్పందించారు. బంగారం అనేది ప్రతి భారతీయుని పెట్టుబడిలో భాగం కాబట్టి ప్రతి పౌరుడు బంగారాన్ని డిజిటల్ విధానంలో కొనుగోలు చేసే, అమ్మగలిగే మార్గాలను రూపొందించడం అత్యసరమని చెప్పారు. గతేడాది కాలంగా బంగారం పొదుపు సాధనంగా తిరిగి పుంజుకుందని, వినియోగదారులు తమకు నచ్చిన పద్ధతిలో పెట్టుబడులు పెట్టేందుకు, వారికి బంగారు సంబంధిత ఉత్పత్తులను అందించేందుకు ఎయిర్టెల్ పేమేంట్స్ బ్యాంక్ తో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు.

డిపాజిట్లపై 6 శాతం వడ్డీ..
బంగారాన్ని డిజిటల్ రూపంలో సేఫ్ గోల్డ్ అందిస్తుంది. వినియోగదారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 24 క్యారెట్ల బంగారాన్ని అందజేస్తుంది. ఇది సెబీ రిజెస్టర్డ్ ట్రస్టీ అని ఎయిర్టెల్ పేమేంట్స్ బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. ఇంటర్నెట్ సౌలభ్యం, వేగాన్ని మిళితం చేస్తుందని, సంప్రదాయ బంగారు కొనుగోళ్ల కంటే ఎక్కువ భద్రతను కలిగి ఉంటుందని స్పష్టం చేసింది. ఎయిర్టెల్ పేమేంట్స్ బ్యాంక్ ఇటీవలే ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా తన సేవింగ్స్ డిపాజిట్ లిమిట్ ను రూ.2 లక్షలకు పెంచింది. ప్రస్తుతం లక్ష నుంచి 2 లక్షల మధ్య డిపాజిట్లపై 6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published: