హోమ్ /వార్తలు /బిజినెస్ /

ATM: ఎయిర్‌టెల్ కొత్త సర్వీసులు.. ఒకేసారి రూ.10 వేలు పొందొచ్చు!

ATM: ఎయిర్‌టెల్ కొత్త సర్వీసులు.. ఒకేసారి రూ.10 వేలు పొందొచ్చు!

ఎయిర్‌టెల్ ఏటీఎం సర్వీసులు.. ఇక సులభంగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!

ఎయిర్‌టెల్ ఏటీఎం సర్వీసులు.. ఇక సులభంగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!

Micro ATM | ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా కొత్త సేవలు తీసుకువచ్చింది. మైక్రో ఏటీఎం సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో చాలా మంది కస్టమర్లకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Airtel Payments Bank ATM | ఎయిర్‌టెల్ (Airtel) పేమెంట్స్ బ్యాంక్ తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. మైక్రో ఏటీఎంలను (ATM) ప్రారంభించింది. మెట్రో, టైర్ 1 పట్టణాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లకు కూడా సులభంగానే డబ్బులు విత్‌డ్రా చేసుకునేలా ఈ సేవలను ఆవిష్కరించింది. డెబిట్ కార్డు (Debit Card) ద్వారా ఈ మైక్రో ఏటీఎంల నుంచి కస్టమర్లు ఈజీగా డబ్బులు తీసుకోవచ్చు.

  దశల వారీగా దేశవ్యాప్తంగా 1.5 లక్షల మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. టైర్ 2 పట్టణాలు, పాక్షిక పట్టణాల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది. తర్వాత ఎక్కువ బ్యాంకింగ్ పాయింట్లకు ఈ సేవలను క్రమంగా విస్తరించుకుంటూ వస్తామని వెల్లడించింది.

  కొత్త సిమ్ కార్డు తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే రూ.50 వేలు జరిమానా, ఏడాది జైలు శిక్ష!

  టైర్ 2, సెమీ అర్బన్ ప్రాంతాల్లో క్యాష్ విత్‌డ్రాయెల్ సర్వీసులకు అధిక డిమాండ్ ఉందని ఎయిర్‌టెల్ పేర్కొంది. అయితే ఏటీఎంల యాక్సెస్ మాత్రం పరిమితంగా ఉందని తెలిపింది. అందుకే తొలిగా ఈ ప్రాంతాల్లో మైక్రో ఏటీఎం సర్వీసులు అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా బ్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా మైక్రో ఏటీఎం సర్వీసులు దశల వారీగా అందుబాటులోకి వస్తాయి.

  కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్.. అమలుపై కేంద్రం కీలక నిర్ణయం

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి కల్లా 1.5 లక్షల మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మైక్రో ఏటీఎం సర్వీసుల కోసం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్‌ఎస్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తీసుకువస్తున్న తొలి డివైజ్ ఇదే కావడం గమనార్హం. బ్యాంక్ కస్టమర్లు మైక్రో ఏటీఎం ద్వారా ఒక ట్రాన్సాక్షన్‌పై రూ.10 వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

  బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు ఈ మైక్రో ఏటీఎంలను అందజేస్తారు. వీళ్లు కస్టమర్లకు డబ్బులు విత్‌డ్రా చేయిస్తారు. అంటే డబ్బులు విత్‌డ్రా చేయడానికి ప్రాసెస్‌ను స్టార్ట్ చేస్తారు. తర్వాత కస్టమర్లు మైక్రో ఏటీఎంలో డెబిట్ కార్డు ఉంచి పిన్ ఎంటర్ చేస్తారు. తర్వాత బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఎంపిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేస్తారు. కస్టమర్లకు డబ్బులు అందజేస్తారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తీసుకువచ్చిన ఈ కొత్త సేవల వల్ల ఏటీఎం సర్వీసులు సరిగా అందుబాటులోకి లేని వారికి చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కువ దూరం వెళ్లాల్సిన పని లేకుండానే సులభంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: AIRTEL, ATM, Atm withdrawal, Bank

  ఉత్తమ కథలు