• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • AIRTEL PAYMENTS BANK ANNOUNCED MOSQUITO DISEASES PROTECTION POLICY WITH HDFC ERGO GENERAL INSURANCE COMPANY PARTNERSHIP SS

Airtel-HDFC: ఏడాదికి రూ.99 చెల్లిస్తే దోమకాటు రోగాలకు ఇన్స్యూరెన్స్

Airtel-HDFC: ఏడాదికి రూ.99 చెల్లిస్తే దోమకాటు రోగాలకు ఇన్స్యూరెన్స్

Airtel-HDFC: ఏడాదికి రూ.99 చెల్లిస్తే దోమకాటు రోగాలకు ఇన్స్యూరెన్స్

Mosquito Diseases Protection Policy | దోమకాటు వల్ల వచ్చే ఏడు సాధారణ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికున్‌గన్యా, జపనీస్ ఎన్సెఫాలిటిస్, లింఫాటిక్ ఫిలేరియాసిస్, కాలా అజార్, జికా వైరస్‌లను 'మస్కిటో డిసీజెస్ ప్రొటెక్షన్ పాలసీ' కవర్ చేస్తుంది.

  • Share this:
    దోమకాటు... ఈ మాట వింటేనే వణికిపోతున్నారు ప్రజలు. ఇటీవల దోమకాటువల్ల రోగాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సంయుక్తంగా 'మస్కిటో డిసీజెస్ ప్రొటెక్షన్ పాలసీ'-MDPP ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలోని 'వ్యాలెట్ ఇన్స్యూరెన్స్ పోర్ట్‌ఫోలియో' భాగంగా ఈ పాలసీని రూపొందించింది. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్లు ఏడాదికి కేవలం రూ.99 చెల్లించి 'మస్కిటో డిసీజెస్ ప్రొటెక్షన్ పాలసీ' తీసుకోవచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లోని 40 లక్షల కస్టమర్లకు ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది.

    వినూత్నమైన ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్‌ను తక్కువ ధరకే అందించడం పట్ల ఆనందంగా ఉంది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన పాలసీ ఇది. దేశంలోని మా లక్షలాది మంది కస్టమర్లకు పేపర్‌లెస్ ఇన్స్యూరెన్స్‌ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
    అనుబ్రాత బిశ్వాస్, ఎండీ అండ్ సీఈఓ, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్


    దోమకాటు వల్ల వచ్చే ఏడు సాధారణ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికున్‌గన్యా, జపనీస్ ఎన్సెఫాలిటిస్, లింఫాటిక్ ఫిలేరియాసిస్, కాలా అజార్, జికా వైరస్‌లను 'మస్కిటో డిసీజెస్ ప్రొటెక్షన్ పాలసీ' కవర్ చేస్తుంది. ఈ వ్యాధుల వల్ల ఎవరైనా ఆస్పత్రిపాలైతే వారికి ఆర్థికంగా చేయూతను ఇవ్వనుంది 'మస్కిటో డిసీజెస్ ప్రొటెక్షన్ పాలసీ'. 24 గంటలపాటు ఆస్పత్రిలో ఉన్నా క్లెయిమ్ చేసుకోవచ్చు.

    Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Redmi offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రెడ్‌మీ ఫోన్లపై ఆఫర్లు ఇవే...

    Realme Offers: ఫెస్టివల్ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే

    Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... కొత్త రేట్లు ఇవే
    First published: