Home /News /business /

AIRTEL OFFERS CHEAP PREPAID RECHARGE PLAN AT RS 149 KNOW BENEFITS SS

Airtel Plan: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్

Airtel Plan: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel Plan: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Plan | తక్కువ ధరకే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ కోసం చూస్తున్న యూజర్లకు శుభవార్త. రూ.149, రూ.219 ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి.

    తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త. రూ.150 లోపే రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది ఎయిర్‌టెల్. కస్టమర్లు రూ.149 ప్లాన్ రీఛార్జ్ చేసుకొని కాల్స్‌, ఎస్ఎంఎస్, మొబైల్ డేటా ప్లాన్స్ పొందొచ్చు. ఎయిర్‌టెల్‌లో రూ.149 రీఛార్జ్ చేసుకున్నవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ మొబైల్ డేటా వాడుకోవచ్చు. రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. అంతేకాదు... వ్యాల్యూ యాడెడ్ సర్వీసెస్ కింద ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ పొందొచ్చు. ఇందులో 370 లైవ్ టీవీ ఛానెల్స్, 10,000 సినిమాలు, వింక్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యాక్సెస్ లభిస్తుంది.

    ఇక ఎయిర్‌టెల్ రూ.219 రీఛార్జ్ చేసుకున్నవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 1 జీబీ మొబైల్ డేటా వాడుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు కూడా పొందొచ్చు. నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. కొత్త ఫాస్ట్ ట్యాగ్ కొంటే రూ.150 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. వారికి కూడా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వీడియో, వింక్ మ్యూజిక్ సేవలు లభిస్తాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ రూ.179, రూ.279 రీఛార్జ్ ప్లాన్స్‌కు కాల్స్, మొబైల్ డేటా, ఎస్ఎంఎస్‌లతో పాటు రూ.4 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Prize Money: కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.1 కోటి గెలుచుకునే ఛాన్స్

    Digital Cash: ఈ టిప్స్‌తో మీ పేటీఎం, ఫోన్‌ పేలో డబ్బులు సేఫ్

    Auto Sweep: ఈ టెక్నిక్ తెలిస్తే... మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబుల్ వడ్డీ
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans, Business, BUSINESS NEWS

    తదుపరి వార్తలు