Home /News /business /

AIRTEL NEW OFFER GOOD CHANCE FOR AIRTEL USERS FREE HIGH SPEED DATA KNOW HOW TO RECIEVE EVK

Airtel New Offer: ఎయిర్‌టెల్ యూజ‌ర్ల‌కు బంప‌ర్ చాన్స్‌.. ఉచితంగా హై-స్పీడ్ డేటా.. ఎలా పొందాలంటే?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Airtel New Offer | ఎయిర్‌టెల్ యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ అందిస్తోంది. ఎంపిక చేసిన కస్టమర్లకు ఎయిర్‌టెల్ ఉచిత డేటాను అందిస్తున్నట్లు సమాచారం. టెలికాం ఆపరేటర్ వినియోగదారులకు 1GB ఉచిత హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటాను అందిస్తోంది.

    ఎయిర్‌టెల్ యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ అందిస్తోంది. ఎంపిక చేసిన కస్టమర్లకు ఎయిర్‌టెల్ ఉచిత డేటాను అందిస్తున్నట్లు సమాచారం. టెలికాం ఆపరేటర్ వినియోగదారులకు 1GB ఉచిత హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటాను అందిస్తోంది. ఇది మరింత మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కావ‌చ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

    ఎలా తెలుస్తుంది..
    - ఎయిర్‌టెల్ ఎంపిక చేసిన వినియోగదారులకు SMS పంపుతోంది.
    - కంపెనీ డేటా వోచర్ రూపంలో ఉచిత 1GB డేటాను క్రెడిట్ చేసినట్లు పేర్కొంది.
    - మీరు ఈ ఆఫర్‌ను స్వీకరించినట్లయితే, మీరు కంపెనీ అధికారిక యాప్ ద్వారా దానిని క్లెయిమ్ చేయగలరు.
    - ఉచిత డేటా వోచర్ జూన్ 1 వరకు చెల్లుబాటులో ఉంటుంది.
    - కాబట్టి, మీరు దీన్ని ఇంకా పొందకుంటే, మీరు ఏమీ చెల్లించకుండానే ఈ అదనపు డేటాను ఉపయోగించవచ్చు.

    Fight for Rs.2: రూ.2 కోసం పోరాటం చేస్తే.. 2.98 లక్షల మందికి డ‌బ్బులు వాప‌స్ వ‌చ్చాయి

    ఎలా క్లెయిమ్ చేసుకోవాలి...
    - ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లోని కూపన్‌ల విభాగంలో డేటా వోచర్ కనిపిస్తుంది.
    - మీకు ఆఫ‌ర్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే Airtel యాప్‌లో చెక్ చేసుకోవచ్చు.
    - ఉచిత డేటా వోచర్ "సాధారణంగా రూ. 99 స్మార్ట్ ప్యాక్‌పై తక్కువ రీఛార్జ్ కస్టమర్ల‌కు అందిస్తారు.
    - అర్హత ఉన్న కస్టమర్‌లు విజయవంతంగా క్లెయిమ్ చేస్తే 15 నిమిషాల్లో డేటా వోచర్‌ను పొందుతారని నివేదిక చెబుతోంది.

    కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌..
    ఎయిర్‌టెల్ మూడు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. Airtel నుంచి తాజా రూ.1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ Airtel 4K Xstream బాక్స్‌తో 350కి పైగా ఛానెల్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ బాక్స్ కోసం ఒకరు రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది, ఇది వన్-టైమ్ ఛార్జ్. ఈ సెటప్ బాక్స్‌తో, వినియోగదారులు కేబుల్ టీవీతో పాటు OTT కంటెంట్‌ను అందిస్తోంది.

    Investment Tips: ఈక్విటీలో పెట్టుబ‌డి పెడుతున్నారా.. ఈ జాగ్ర‌త్తలు తీసుకోండి

    ఈ ప్లాన్‌లో 300Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, DivoTV, Klikk, Nammaflix, Dollywood మరియు Shorts TVతో సహా 14 OTTల కోసం Airtel Xstream Premium సింగిల్ లాగిన్ ఉంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వినియోగదారులు నెలవారీ ప్రాతిపదికన 3.3TB డేటాను పొందుతారు.

    EPFO Withdraw: ఈపీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేస్తున్నారా..? అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి

    3.3TB నెలవారీ FUP డేటాతో 200Mbps వేగంతో వచ్చే రూ.1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా ఉంది. OTT ల కోసం రూ. 1599 ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఉంటాయి. ఇందులో విన‌యోగ‌దారుడు Netflixని పొందలేకపోవడం మాత్రమే తేడా. కానీ, మీరు ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో అన్ని ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయోచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆఫర్ కూడా దీనిపై చెల్లుబాటు అవుతుంది. అంతే కాకుండా కస్టమర్‌లు దీనితో 350+ టీవీ ఛానెల్‌లను కూడా పొందుతారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు