హోమ్ /వార్తలు /బిజినెస్ /

Airtel Plans: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

Airtel Plans: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

Airtel Plans: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel Plans: ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Airtel prepaid recharge plans | ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్ ప్రకటించింది. వాటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.

  ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. మరో రెండు కొత్త ప్లాన్స్‌ను పరిచయం చేసింది ఎయిర్‌టెల్. రూ.129, రూ.199 ప్లాన్స్‌ను గతంలోనే ఢిల్లీ, అస్సాం, ముంబై, కేరళ లాంటి సర్కిల్స్‌లో రిలీజ్ చేసింది. కానీ ఆ ప్లాన్స్ ఆంధ్రప్రదేశ్‌తో పాటు చెన్నై, హిమాచల్ ప్రదేశ్ లాంటి సర్కిల్స్‌లో అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు ఈ రెండు ప్లాన్స్‌ను దేశంలోని 23 సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  Airtel Rs 129 Plan: ఎయిర్‌టెల్ రూ.129 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 1జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 24 రోజులు. అన్ని నెట్వర్క్‌లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేయొచ్చు. 24 రోజులకు 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌‌లో డైలీ డేటా బెనిఫిట్స్ ఉండవు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్స్ లాంటి వాటికి ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

  Airtel Rs 199 Plan: ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్ని నెట్వర్క్‌లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేయొచ్చు. ఈ ప్లాన్‌కు కూడా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి.

  PAN-Aadhaar: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సేఫేనా? ఇలా దాచుకోండి

  PAN Card: పాన్ కార్డులో తప్పులున్నాయా? ఈ యాప్‌లో అప్లై చేయండి ఇలా

  ఎయిర్‌టెల్. రూ.129, రూ.199 ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ మాత్రమే వస్తుంది. ఒకవేళ 28 రోజుల వేలిడిటీ కావాలనుకుంటే రూ.219, రూ.249 ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్లాన్స్ వివరాలివే.

  Airtel Rs 219 Plan: ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్ రీఛార్జ్ ఛేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్ని నెట్వర్క్స్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

  Airtel Rs 249 Plan: ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్ రీఛార్జ్ ఛేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్ని నెట్వర్క్స్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, Business, BUSINESS NEWS

  ఉత్తమ కథలు