Airtel: వారికి 4జీ స్పీడ్ ఎక్కువ ఇస్తామంటున్న ఎయిర్‌టెల్

Airtel: వారికి 4జీ స్పీడ్ ఎక్కువ ఇస్తామంటున్న ఎయిర్‌టెల్ (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Priority 4G Network | కస్టమర్లకు సరికొత్త సేవల్ని ప్రారంభించింది ఎయిర్‌టెల్. 4జీ డేటా స్పీడ్‌గా ఇచ్చేందుకు 'ప్రియార్టీ 4జీ నెట్వర్క్' ప్రారంభించింది.

  • Share this:
    మీరు ఎయిర్‌టెల్ కస్టమరా? 4జీ స్పీడ్ ఎక్కువ కావాలా? అయితే ప్లాటినమ్ ప్లాన్‌లోకి మారమంటోంది ఎయిర్‌టెల్. ప్లాటినమ్ మొబైల్ కస్టమర్లకు వేగవంతమైన 4జీ డేటా అందిస్తామని హామీ ఇస్తోంది. ఇందుకోసం 'ప్రియార్టీ 4జీ నెట్వర్క్' సేవల్ని లాంఛ్ చేసింది. తమ ప్లాటినమ్ మొబైల్ కస్టమర్లకు 4జీ సేవల్ని నిరంతరాయంగా, వేగంగా, ప్రాధాన్యతతో అందించడానికి సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తోంది. ఫలితంగా ప్లాటినమ్ కస్టమర్లు అందరూ వేగవంతమైన 4జీ డేటాను పొందొచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.499 కన్నా ఎక్కువ పోస్ట్ పెయిడ్ మొబైల్ కస్టమర్లు అందర్నీ ప్లాటినమ్ కస్టమర్లుగా గుర్తించింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో ప్లాటినమ్ యూఐ ద్వారా వారికి ప్రత్యేకమైన బెనిఫిట్స్ అందిస్తోంది.

    SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎస్‌బీఐ రూల్స్ ఇవే

    'ప్రియార్టీ 4జీ నెట్వర్క్' సేవల ద్వారా ప్లాటినమ్ కస్టమర్లకు డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్‌ని పెంచుతుందని ఎయిర్‌టెల్ చెబుతోంది. ఎయిర్‌టెల్ ప్లాటినమ్ కస్టమర్లకు రీటైల్ స్టోర్లతో పాటు కాల్ సెంటర్లలో రెడ్ కార్పెట్ కస్టమర్ కేర్ సర్వీస్ లభిస్తుందని చెబుతోంది. అన్ని ఎయిర్‌టెల్ కాల్ సెంటర్లలో, రీటైల్ స్టోర్లలో ప్లాటినమ్ కస్టమర్లకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించింది ఈ కంపెనీ. దీని వల్ల కస్టమర్లు వేచిచూసే సమయం తగ్గిపోతుంది. మీరు కూడా ప్లాటినమ్ కస్టమర్ అయితే ఈ సేవలన్నీ పొందొచ్చు.

    JioFiber: జియోఫైబర్ సెట్ టాప్ బాక్స్ ఉందా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే

    ప్రస్తుతం ఎయిర్‌టెల్ కస్టమర్లుగా ఉన్నవారు ప్లాటినమ్ కస్టమర్‌గా మారొచ్చు. ఇతర నెట్వర్క్స్‌కి చెందిన కస్టమర్లు నేరుగా ఎయిర్‌టెల్‌లో ప్లాటినమ్ కస్టమర్ ప్లాన్ తీసుకోవచ్చు. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ రూ.499 ధరతో ప్రారంభమవుతాయి. 'ప్రియార్టీ 4జీ సిమ్' ద్వారా సిమ్ కార్డును కస్టమర్ల ఇంటికే డెలివరీ చేస్తుంది ఎయిర్‌టెల్.
    Published by:Santhosh Kumar S
    First published: