హోమ్ /వార్తలు /బిజినెస్ /

Recharge Plans under Rs.100: రూ.100 లోపు అనేక డేటా, టాక్ టైం రీచార్జ్ ప్లాన్లు.. ఈ వివరాలను తెలుసుకోండి

Recharge Plans under Rs.100: రూ.100 లోపు అనేక డేటా, టాక్ టైం రీచార్జ్ ప్లాన్లు.. ఈ వివరాలను తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కస్టమర్ల అవసరాల కోసం టెలికాం నెట్‌వర్క్‌లు వివిధ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎయిర్‌టెల్, BSNL, జియో, వొడాఫోన్ ఐడియా- Vi సంస్థలు రూ.100 లోపు డేటా, టాక్ టైమ్ ప్లాన్లను అందిస్తున్నాయి.

కస్టమర్ల అవసరాల కోసం టెలికాం నెట్‌వర్క్‌లు వివిధ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎయిర్‌టెల్, BSNL, జియో, వొడాఫోన్ ఐడియా- Vi సంస్థలు రూ.100 లోపు డేటా, టాక్ టైమ్ ప్లాన్లను అందిస్తున్నాయి. డేటా, టాక్‌టైం అవసరాలను బట్టి వినియోగదారులు వీటిని ఎంచుకోవచ్చు. తక్కువ ధరల్లో లభించే కొన్ని ప్లాన్లు కేవలం డేటాను, మరికొన్ని టాక్‌టైమ్‌ను మాత్రమే అందిస్తున్నాయి. కానీ ఈ రెండు అవసరాల కోసం దాదాపు అన్ని నెట్‌వర్క్‌లు ప్రత్యేకంగా తక్కువ ధరల్లో టారిఫ్‌లను అందిస్తున్నాయి. వీటి వ్యాలిడిటీ తక్కువగా ఉంటుంది. వీటిల్లో కొన్ని ప్లాన్లు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. వీడియో స్ట్రీమింగ్ యాప్‌లకు యాక్సెస్ ఇవ్వడం, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ఉచితంగా అందించడం వంటివి ఈ విభాగంలో ఉన్నాయి.

ఎయిర్‌టెల్‌ టాక్ టైమ్ ప్లాన్లు రూ.10 నుంచి ప్రారంభమవుతున్నాయి. జియో సంస్థ రూ.11 నుంచి డేటా ప్లాన్లను అందిస్తోంది. Vi ప్లాన్లు రూ.16 నుంచి ప్రారంభమవుతున్నాయి. నెట్‌వర్క్‌లు అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్‌లు, వెబ్‌సైట్‌ల నుంచి ఈ ప్లాన్లు, వోచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. రూ.100 లోపు వివిధ నెట్‌వర్క్‌లు అందించే ప్లాన్లు, వాటి ప్రయోజనాలను పరిశీలిద్దాం.

ఎయిర్‌టెల్ టాక్ టైమ్ ప్లాన్లు (28 రోజుల వ్యాలిడిటీ)

ఎయిర్‌టెల్ రూ.45, రూ.49, రూ.79 టాక్ టైమ్ ప్లాన్లను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. రూ.49 ప్లాన్ ద్వారా 100MB డేటాను, రూ.79 ప్లాన్ ద్వారా 200MB డేటాను కస్టమర్లు పొందవచ్చు.

రూ.100 లోపు ఎయిర్‌టెల్ టాక్ టైమ్ ప్లాన్లు

ఎయిర్‌టెల్ రూ.10 నుంచి టాక్ టైమ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ విభాగంలో రూ.20 నుంచి రూ.100 వరకు వోచర్లు అన్‌లిమిటెడ్ వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ.48 డేటా ప్లాన్

ఇది ఒక డేటా ప్లాన్. రూ.48తో రీచార్జ్ చేయించుకున్న వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీతో 3GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ను ప్రత్యేక ప్లాన్‌గా, స్టాండ్ ఎలోన్ ప్లాన్‌గా వాడుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.98 డేటా ప్లాన్

ఇది కూడా కేవలం డేటాకే పరిమితమైన ప్లాన్. దీంతో రీచార్జ్ చేయించుకున్న కస్టమర్లు 12 GB డేటాను పొందవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్లాన్ వ్యాలిడిటీ వరకు ఈ 12 GB డేటాను వాడుకోవచ్చు.

Vi టాక్ టైమ్ ప్లాన్లు (28 రోజుల వ్యాలిడిటీ)

ఈ సంస్థ రూ.49, రూ.59, రూ.65, రూ.79, రూ.85తో డేటా, టాక్‌టైమ్ కాంబినేషన్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లతో కస్టమర్లు 28 రోజుల వ్యాలిడిటీతో 400 ఎంబీ వరకు డేటాను అదనంగా పొందవచ్చు.

Vi రూ.98 డేటా ప్లాన్

ఇది డబుల్ డేటా ఆఫర్. ఈ ప్లాన్ ద్వారా 12GB డేటాను 28 రోజుల వరకు వాడుకోవచ్చు.

Vi రూ.48 డేటా ప్లాన్

ఇది Vi నుంచి వచ్చిన స్పెషల్ డేటా ప్లాన్. దీని వ్యాలిడిటీ 28 రోజులు. రూ.48 టారిఫ్‌తో కస్టమర్లు 12 GB డేటాను పొందవచ్చు. యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే 200 MB డేటా అదనంగా లభిస్తుంది.

జియో టాక్ టైమ్ ప్లాన్లు

జియో సంస్థ రూ.10, రూ.20, రూ.50, రూ.100తో ప్రత్యేక ఓచర్లను అందిస్తోంది. ఇవన్నీ టాక్‌టాప్ ప్లాన్లే. ఇవి డేటా ప్రయోజనాలను అందించవు.

జియో డేటా ప్లాన్లు

జియో రూ.11, రూ.21, రూ.51, రూ.101 ధరతో 4G డేటా ప్లాన్లను అందిస్తోంది. ఇవి 1GB, 2GB, 6GB, 12GB డేటాను అందిస్తున్నాయి.

BSNL రూ.94, రూ.95 ప్రీపెయిడ్ ప్లాన్లు

BSNL ఈ ప్లాన్లను గత ఏడాది ప్రవేశపెట్టింది. వీటి ద్వారా కస్టమర్లు 90 రోజుల వ్యాలిడిటీ ఉండే 3GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. దీంతోపాటు 100 నిమిషాల ఫ్రీ వాయిస్ కాల్స్ కూడా లభిస్తాయి. లోకల్, నేషనల్ రోమింగ్ నెట్‌వర్క్స్‌కు ఈ వంద నిమిషాలు కాల్స్ చేసుకోవచ్చు.

First published:

Tags: Airtel recharge plans, Jio, Mobile Data, Telecom

ఉత్తమ కథలు