• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • AIRTEL HELLO TUNES IS FREE FOR ALL CUSTOMERS THROUGH WYNK MUSIC APP SS

Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఈ సర్వీస్ ఉచితం

Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఈ సర్వీస్ ఉచితం

Airtel: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఈ సర్వీస్ ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)

Airtel | ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఉచితంగా ఓ సర్వీస్‌ను కస్టమర్లందరికీ అందిస్తోంది ఎయిర్‌టెల్. వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఎయిర్‌టెల్ కస్టమర్లకు శుభవార్త. ఉచితంగా హెలో ట్యూన్స్ అందిస్తోంది ఎయిర్‌టెల్. వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఈ సర్వీస్ ఉచితంగా పొందొచ్చు. ఇందుకోసం వింక్ మ్యూజిక్‌తో కలిసి #ExpresswithHellotune పేరుతో క్యాంపైన్ నిర్వహిస్తోంది ఎయిర్‌టెల్. కస్టమర్లు తమ మూడ్స్, ఫీలింగ్స్‌కు తగ్గట్టుగా తమకు నచ్చిన పాటల్ని హెలో ట్యూన్‌గా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ డిస్టెన్సింగ్ కారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు గతంలో లాగా కలుసుకోవట్లేదని, అందుకే తమ ఫీలింగ్స్‌ని #ExpressWithHellotune ద్వారా షేర్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతోంది ఎయిర్‌టెల్. మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు నచ్చిన పాటల్ని హెలో ట్యూన్‌గా సెట్ చేసుకోవచ్చు. వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఉచితంగానే పాటల్ని సెట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ఎయిర్‌టెల్ కస్టమర్లందరికీ ఉచితం.

    Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆ ప్లాన్ ఔట్... యూజర్లకు కొత్త ఆఫర్

    Home Loan: సొంత ఇల్లు మీ కలా? లేటెస్ట్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇవే

    ఎయిర్‌టెల్ కస్టమర్లు వింక్ మ్యూజిక్ యాప్‌లోని 60 లక్షల పాటలను హెలో ట్యూన్‌గా ఉచితంగా సెట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా హెలో ట్యూన్‌ ఉచితంగానే మార్చొచ్చు. వింక్ మ్యూజిక్ యాప్‌లోని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, తమిళ్, మళయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ లాంటి 15 భాషల పాటలు ఉన్నాయి. ఇక ఎయిర్‌టెల్ హెలో ట్యూన్స్ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్లకు ఉచితం. #ExpresswithHellotune క్యాంపైన్‌లో భాగంగా నాన్ ఎయిర్‌టెల్ కస్టమర్లకు 14 రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది ఎయిర్‌టెల్. కస్టమర్లు వింక్ మ్యూజిక్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: