Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆ ప్లాన్ ఔట్... యూజర్లకు కొత్త ఆఫర్

Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆ ప్లాన్ ఔట్... యూజర్లకు కొత్త ఆఫర్ (ప్రతీకాత్మక చిత్రం)

Airtel | ఎయిర్‌‌టెల్ యూజర్లకు అలర్ట్. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌ నుంచి ఓ ప్లాన్‌ను నిలిపివేసింది. మరోవైపు కొత్తగా ఆఫర్స్ ప్రకటించింది.

  • Share this:
    భారతీ ఎయిర్‌టెల్ రూ.2,398 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఆపేసింగి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి 365 రోజుల వేలిడిటీ, రోజూ 1.5జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు రూ.2,398 ప్లాన్‌ను నిలిపివేసింది కంపెనీ. ఎయిర్‌టెల్ సైట్‌లో ప్రస్తుతం ఈ ప్లాన్ కనిపించట్లేదు. అంతేకాదు... పేటీఎం, గూగుల్ పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రీఛార్జ్ చేయాలన్నా ఈ ప్లాన్ అందుబాటులో లేదు. ఏడాది వేలిడిటీతో రూ.2,398 ప్లాన్‌ను గతేడాది డిసెంబర్‌లో తీసుకొచ్చింది ఎయిర్‌టెల్. ప్రస్తుతం 365 రోజుల వేలిడిటీతో రూ.2,498 ప్లాన్ ఉంది. ఈ ప్లాన్‌ను ఈ ఏడాది మేలో పరిచయం చేసింది ఎయిర్‌టెల్. రూ.2,498 ద్వారా 365 రోజుల వేలిడిటీ, వాయిస్ కాల్స్, రోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్‌ బెనిఫిట్స్ లభిస్తాయి.

    Credit Score: మీ క్రెడిట్ స్కోర్ 750 కన్నా తక్కువ ఉందా? చెక్ చేయండి ఇలా

    SBI Health Policy: ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని... తక్కువ ధరకే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ

    మరోవైపు ఎయిర్‌టెల్ 6జీబీ వరకు హైస్పీడ్ డేటా అందించే ఫ్రీ డేటా కూపన్స్ తీసుకొచ్చింది. రూ.219 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసిన కస్టమర్లు ఫ్రీ డేటా కూపన్స్ పొందొచ్చు. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు ఫ్రీ డేటా కూపన్స్ లభిస్తాయి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసిన కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ పొందొచ్చు. ఆఫర్ గెలుచుకున్న కస్టమర్లకు కంపెనీ నుంచి కాల్ వస్తుంది. అదే రోజు ఫ్రీ కూపన్ యాక్టివేట్ అవుతుంది. ఒకసారి ఈ ఆఫర్ పొందిన కస్టమర్లకు మళ్లీ ఇదే ఆఫర్ వర్తించదు. కస్టమర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కూపన్ సెక్షన్‌లో ఫ్రీ డేటా కూపన్స్ యాక్టివేట్ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: