Unlimited Data: వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? తక్కువ ధరకు లభించే అన్ లిమిటెడ్ డేటా ప్లాన్లు ఇవే..

డిమాండ్ కారణంగా కొన్ని నెట్వర్కులు అందుబాటులో ధరకే ఇంటర్నెట్ బ్రౌజింగ్ ప్లాన్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఎయిర్టెల్, బీఎన్ఎన్ఎల్, జియో లాంటి బడా కంపెనీలు రూ.1500లోపే మెరుగైన ఇంటర్నెట్ ప్లాన్స్ తీసుకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

news18-telugu
Updated: November 21, 2020, 6:18 PM IST
Unlimited Data: వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? తక్కువ ధరకు లభించే అన్ లిమిటెడ్ డేటా ప్లాన్లు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోవిడ్-19 ప్రభావంతో ఉద్యోగులంతా దాదాపు ఇంటి దగ్గరే నుంచి పనిచేసే అవకాశాన్నిచ్చాయి కంపెనీలు. అంతేకాకుండా ఇంటి వద్దే ఉండటం వల్ల ఓటీటీకి కూడా ఈ ఏడాది డిమాండ్ బాగా పెరిగింది. ఇష్టమైన సినిమాలు, సిరీస్, టీవీ షోలు చూసేందుకు డిజిటల్ ప్లాట్ ఫామ్ ను విపరీతంగా ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు సినిమాలు చూసేందుకుగాను ఇంటర్నెట్ అవసరం బాగా పెరిగింది. ఈ డిమాండ్ కారణంగా కొన్ని నెట్వర్కులు అందుబాటులో ధరకే ఇంటర్నెట్ బ్రౌజింగ్ ప్లాన్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఎయిర్టెల్, బీఎన్ఎన్ఎల్, జియో లాంటి బడా కంపెనీలు రూ.1500లోపే మెరుగైన ఇంటర్నెట్ ప్లాన్స్ తీసుకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఎయిర్టెల్ అన్ లిమిటెడ్ 499 బ్రాడ్  బ్యాండ్ ప్లాన్..

ఈ ప్లాన్ లో 40ఎంబీపీఎస్ వరకు స్పీడుతో అపరమిత ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ లాంటి సబ్ స్క్రిప్షన్స్ బెనిఫిట్లు ఉన్నాయి.

ఎయిర్టెల్ ప్రీమియం 799 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్..
ఈ ప్లాన్ తో అప్ టూ 70 ఎంబీపీఎస్ స్పీడుతో అపరిమిత ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. అంతేకాకుండా ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ లాంటి అదనపు సబ్ స్క్రిప్షన్స్ ను వినియోగదారుల ముందుంచింది. 499, 799 ఎయిర్టెల్ వినియోగదారులు బేసిక్ ప్లాన్స్.

రూ.999 ఎయిర్టెల్ ప్లాన్..
ఈ ప్లాన్ తో అపరిమిత ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. కాల్స్ ను 200 ఎంబీపీఎస్ స్పీడుతో అందిస్తుంది. ఈ స్ట్రీమింగ్ బెనిఫిట్లు ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ బాక్స్ తో పాటు ఏడాది పాటు జీ5 ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వాన్ని పొందొచ్చు.




రూ.1499ల ఎయిర్టెల్ అల్ట్రా బ్రాడ్ బ్యాండ్ ప్లాన్..

ఈ ఎయిర్టెల్ అల్ట్రా బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అపరిమిత ఇంటర్నెట్ సేవలను 300 ఎంబీపీఎస్ స్పీడుతో అందిస్తుంది. అంతేకాకుండా అపరిమిత లోకల్, STD కాల్స్ ను ఇస్తుంది. అంతేకాకుండా ఏడాది పాటు జీ5 ప్రీమియం, అమేజాన్ ప్రైమ్ తో పాటు ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ బాక్స్ స్ట్రీమింగ్ బెనిఫిట్లను పొందవచ్చు.

BSNL భారత్ ఫైబర్ 449 బ్రాండ్ బ్యాండ్ ప్లాన్..
అక్టోబరులో BSNL బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు రూపొందించనపుడు 90 రోజుల ప్రమోషనల్ పీరియడ్ ఉంటుందని సంస్థ తెలిపింది. టెల్కో ఈ ప్రణాళికను క్రమబద్దీకరిస్తుందో లేదో చూడాలి. ఫైబర్ బేసిక్ ప్లాన్ అని పిలిచే 449 బ్రాడ్ బాండ్ ప్లాన్ 3.3TB వేగం లేదా 3300 జీబీ FUP పరిమితి వరకు 30 ఎంబీపీఎస్ స్పీడును ఇస్తుంది. FUP పరిమితి చేరుకున్న తర్వాత వేగం 2 ఎంబీపీఎస్ కు తగ్గుతుంది. ఈ ప్లాన్ ను ఎంచుకునే వినియోగదారులకు భారత్ లోని ఏ నెట్వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. అండమాన్-నికోబార్ మినహా అన్ని వర్గాల్లోనూ BSNL ఈ ప్రణాళికను అందుబాటులోకి తీసుకొచ్చింది.

BSNL రూ.599ల ఫైబర్ బేసిక్ ప్లస్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్..
ఇది మరో ప్రాథమిక బ్రాడ్ బ్యాండ్ ప్లస్ ప్లాన్. ప్రభుత్వాధీనంలోని టెల్కో ఈ ప్లాన్ గత వారం తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఈ ప్లాన్ FTTH సేవలను అందిస్తుంది. ఈ ప్లాన్ 60 ఎంబీపీఎస్ వేగాన్ని 3300 జీబీ వరకు ఇస్తుంది. వినియోగదారులకు ఈ ప్లాన్ అపరిమిత డేటా ప్రయోజనాలతో వస్తుంది. వినియోగదారులు నెలవారి FUP పరిమితి అయిపోయిన తర్వాత దీని వేగం 2MBPS కు తగ్గించబడుతుంది.

BSNL భారత్ ఫైబర్ రూ.799ల బ్రాడ్ బ్యాండ్ ప్లాన్..
ఈ ప్లాన్ 100ఎంబీపీఎస్ స్పీడుతో పాటు 3300 జీబీ లేదా 3.3టీబీ వరకు వినియోగించకోవచ్చు. FUP పరిమితి చేరుకున్న తర్వాత వేగం 2 ఎంబీపీఎస్ కు తగ్గించబడుతుంది.

BSNL ప్రీమియం ఫైబర్ రూ.999ల బ్రాడ్ ప్లాన్..
ఈ ప్లాన్ తో 200 ఎంబీఎస్ వేగాన్ని 3300జీబీ లేదా 3.3టీబీ డేటాను పొందవచ్చు. డేటా అయిపోయిన తర్వాత 2 ఎంబీపీఎస్ కు వేగం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ ద్వారా డిస్నీ హాట్ స్టార్ కు ఉచిత ప్రీమియం సభ్యత్వంతో వస్తుంది.

BSNL అల్ట్రా ఫైబర్ రూ.1499 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్..
ఈ ప్లాన్ ద్వారా 300 ఎంబీపీఎస్ స్పీడును 4టీబీ లేదా 4000 జీబీ డేటా పొందవచ్చు. FUP పరిమితి దాటిన తర్వాత వేగం 4ఎంబీపీఎస్ కు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ దేశంలోని ఏ నెట్వర్క్ కైనా అపరమిత కాలింగ్ ప్రయోజనాలను ఇస్తుంది. డిస్నీ హాట్ స్టార్ ఉచిత ప్రీమియం సభ్యత్వం కూడా వస్తుంది.

జియో ఫైబర్ రూ.399ల నుంచి రూ.699ల బ్రాడ్ బాండ్ ప్లాన్లను కలిగి ఉంది. ఈ ప్లాన్లు వరుసగా 30 ఎంబీపీఎస్, 60 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. అంతేకాకుండా ఏ ఓటీటీ సభ్యాత్వాలు ఇందులో రావు. అయితే అపరిమిత కాలింగ్ ను మాత్రం అందిస్తాయి.

జియో రూ.999ల బ్రాడ్ బ్యాండ్ ప్లాన్..
ఇది అపరిమిత ఇంటర్నెట్ డౌన్ లోడ్, అప్ లోడ్ తో పాటు 150 ఎంబీపీఎస్ వేగంతో వస్తుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ తో పాటు 1000 రూపాయల విలువైన 11 OTT అనువస్తనాలకు యాక్సెస్ ఇస్తుంది. అంతేకాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా లభిస్తుంది. ఇతర ప్లాన్ లో కొంచెం ఎగువ శ్రేణిలో వస్తాయి.

జియో ఫైబర్ డైమండ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్..
ఈ డైమండ్ ప్లాన్ ధర రూ.1499. అపరమిత ఇంటర్నెట్ సేవలతో పాటు డౌన్ లోడ్, అప్ లోడ్ ఆప్షన్ ఇస్తుంది. 300ఎంబీఎస్ స్పీడును కలిగి ఉండి అపరిమిత వాయిస్ కాలింగ్ ఇస్తుంది. దీంతో పాటు అదనపు ఖర్చు లేకుండా12 ఓటీటీ యాప్స్ లో ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది.
Published by: Nikhil Kumar S
First published: November 21, 2020, 6:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading