హోమ్ /వార్తలు /బిజినెస్ /

Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆల్ ఇన్ వన్ హోమ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆల్ ఇన్ వన్ హోమ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆల్ ఇన్ వన్ హోమ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆల్ ఇన్ వన్ హోమ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Airtel all in one home plan | మొబైల్ కనెక్షన్, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్‌తో కలిపి ఆల్ ఇన్ వన్ హోమ్ ప్లాన్ ప్రకటించింది ఎయిర్‌టెల్. బెనిఫిట్స్ తెలుసుకోండి.

స్మార్ట్‌ఫోన్‌ కోసం ఒక రీఛార్జ్, బ్రాడ్‌బ్యాండ్ కోసం మరో రీఛార్జ్, డీటీహెచ్ కనెక్షన్‌కు ఇంకో రీఛార్జ్... ఇలా వేర్వేరు సేవలకు వేర్వేరుగా రీఛార్జ్‌లు చేయడం ఇబ్బంది అనుకునేవారికోసం ఎయిర్‌టెల్ మూడు ప్లాన్స్ ప్రకటించింది. మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ కనెక్షన్లను కలుపుతూ ఆల్ ఇన్ వన్ హోమ్ ప్లాన్ అందిస్తోంది ఎయిర్‌టెల్. మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ కనెక్షన్లు కావాలనుకుంటే ప్లాన్ ధర రూ.2,720. కానీ 30 శాతం డిస్కౌంట్‌తో రూ.1,899 ధరకే అందిస్తోంది. ఒకవేళ ఫైబర్+పోస్ట్‌పెయిడ్ కావాలంటే రూ.2,097 చెల్లించాలి. కానీ 33 శాతం డిస్కౌంట్‌తో రూ.1,399 ధరకే అందిస్తోంది. డీటీహెచ్+పోస్ట్‌పెయిడ్ కావాలంటే రూ.1,048 చెల్లించాలి. కానీ 14 శాతం డిస్కౌంట్‌తో రూ.899 ధరకే అందిస్తోంది.

ఎయిర్‌టెల్ హోమ్ కస్టమర్లకు అన్ని కనెక్షన్లకు ఒకే బిల్, ఒకే కాల్‌సెంటర్, ప్లాటినమ్ కేర్ ఎక్స్‌పీరియెన్స్, హార్డ్‌వేర్‌పై డిస్కౌంట్, లైఫ్‌టైమ్ ఫ్రీ సర్వీసెస్ లాంటి ప్రయోజనాలు లభిస్తాయి. కస్టమర్లు ప్రస్తుతం ఉన్న కనెక్షన్లనే ఎయిర్‌టెల్ హోమ్ ప్లాన్‌లోకి మార్చుకోవచ్చు. తమ పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ కనెక్షన్లను ఎయిర్‌టెల్ హోమ్‌లో యాడ్ చేయొచ్చు. ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి ప్రయోజనాలు ఉంటాయి. పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌తో పాటు డీటీహెచ్ లేదా బ్రాడ్‌బ్యాండ్ యాడ్ చేయొచ్చు. లేదా రెండింటినీ ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండి

SBI: ఏటీఎం కార్డులు ఉన్నవారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్

First published:

Tags: AIRTEL, Airtel recharge plans, DTH, Internet

ఉత్తమ కథలు