ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త. భారతీ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొని క్రెడిట్ కార్డ్ లాంఛ్ చేసింది. ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Airtel Axis Bank Credit Card) పేరుతో ఈ క్రెడిట్ కార్డ్ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్‌లోని 34 కోట్ల కస్టమర్లకు క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అందించేందుకు యాక్సిస్ బ్యాంకుతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ లాంటి చెల్లింపులపై అదిరిపోయే రివార్డ్స్, క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇలాంటి క్యాష్‌బ్యాక్, స్పెషల్ డిస్కౌంట్స్, డిజిటల్ వోచర్స్, కాంప్లిమెంటరీ సర్వీసెస్ లభిస్తాయి.
ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే వెల్కమ్ బెనిఫిట్ కింద రూ.500 అమెజాన్ వోచర్ లభిస్తుంది. అయితే కార్డు తీసుకున్న 30 రోజుల్లో ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎయిర్టెల్ రీఛార్జులపై 25 శాతం క్యాష్‌బ్యాక్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటోలో చెల్లింపులకు 10 శాతం క్యాష్‌బ్యాక్, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా జరిపే బిల్ పేమెంట్స్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర అన్ని చెల్లింపులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో క్రెడిట్ అవుతుంది.
One card, multiple benefits. Presenting AIRTEL AXIS BANK Credit Card with exclusive benefits:
25% cashback* on Airtel recharges
10% cashback* on bigbasket, Swiggy & Zomato
10% cashback* on utility bills paid via Airtel Thanks App
⁰Make the most out of #AirtelAxisBankConnectpic.twitter.com/I4BrK2a7yE
ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారికి డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులో ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు సార్లు కాంప్లిమెంటరీ లాంజెస్‌లో యాక్సెస్ లభిస్తుంది. అన్ని ఫ్యూయెల్ స్టేషన్స్‌లో రూ.400 నుంచి రూ.4,000 మధ్య లావాదేవీలపై 1 శాతం ఫ్యూయెల్ సర్‌ఛార్జీ మినహాయింపు లభిస్తుంది. ఇక 4000 పైగా పార్ట్నర్ రెస్టారెంట్లలో 20శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డుతో రూ.2,500 కన్నా ఎక్కువ లావాదేవీలు జరిపితే ఈజీ ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని ప్రతీ నెలా ఈఎంఐ చెల్లించొచ్చు.
ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాలి. యాడ్ ఆన్ కార్డుకు జాయినింగ్ ఫీజు ఉండదు. ఇక యాన్యువల్ ఫీజు రూ.500 చెల్లించాలి. ఒక ఏడాదిలో రూ.2,00,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే యాన్యువల్ ఛార్జీ మినహాయింపు లభిస్తుంది. ఎయిర్టెల్ కస్టమర్లు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి అప్లై చేయాలి.
ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్, విస్తారా ఎయిర్‌లైన్స్, ఫ్రీఛార్జ్ లాంటి సంస్థలతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎయిర్‌టెల్‌తో కలిసి ఈ క్రెడిట్ కార్డ్ అందించడం విశేషం.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.