న్యూఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ రూ.1,999... ఎయిర్ ఏసియా కొత్త సర్వీస్

న్యూఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్ ఉదయం 6.05 గంటలకు, సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరుతుంది. తిరిగి హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఉదయం 8.45 గంటలకు, రాత్రి 8.25 గంటలకు బయల్దేరుతుంది.

news18-telugu
Updated: January 11, 2019, 6:34 PM IST
న్యూఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ రూ.1,999... ఎయిర్ ఏసియా కొత్త సర్వీస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు న్యూఢిల్లీ-హైదరాబాద్ మధ్య తరచూ ప్రయాణిస్తుంటారా? మీ కోసం తక్కువ ఫేర్‌తో కొత్త ఫ్లైట్స్ ప్రవేశపెట్టింది ఎయిర్ ఏషియా. న్యూఢిల్లీ, హైదరాబాద్ మధ్య నడిచే ఫ్లైట్లకు టికెట్ ధర రూ.1,999 మాత్రమే. వెబ్‌సైట్, యాప్‌లో ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. న్యూఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్ ఉదయం 6.05 గంటలకు, సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరుతుంది. తిరిగి హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఉదయం 8.45 గంటలకు, రాత్రి 8.25 గంటలకు బయల్దేరుతుంది.

గత నెలలో చెన్నై-హైదరాబాద్ మధ్య విమాన సర్వీసుల్ని ప్రారంభించింది ఎయిర్ఏసియా. జనవరి 15 నుంచి ముంబై, బెంగళూరు మధ్య సేవల్ని ప్రారంభించబోతోంది. ఇక వీటితో పాటు న్యూఢిల్లీకి శ్రీనగర్, పుణె నుంచి కొత్త సర్వీసుల్ని ఫిబ్రవరి 1న ప్రారంభించనుంది. వ్యాపారాన్ని విస్తరించుకుంటున్న ఎయిర్ ఏసియా విమాన సర్వీసుల విస్తరణపై ప్రధానంగా దృష్టిపెట్టింది.


ఇవి కూడా చదవండి:

Work From Home: స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో కూర్చొని రూ.40 వేలు సంపాదించండి ఇలా

Photos: కలర్‌ఫుల్‌గా చైనాలో ఐస్ ఫెస్టివల్... ఆ అందాలు చూడండి

Photos: హంపి అందాలు ఇవే... మీరు తప్పకుండా చూడాల్సినవేకదిలే రైలులో బెర్తు ఖాళీగా ఉందా? ఇక ఈజీగా తెలుసుకోవచ్చు
First published: January 11, 2019, 6:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading