AirAsia Season Sale | ఫ్లైట్ జర్నీ చేయాల్సి ఉందా? అయితే మీకు శుభవార్త. అదిరే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరకే విమాన టికెట్లు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రముఖ విమానయాన కంపెనీల్లో ఒకటైన ఎయిర్ఏసియా (AirAsia) తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ (Flight Ticket) పొందొచ్చు.
ఎయిర్ఏసియా ఇండియా తాజాగా సీజన్ సేల్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు రూ. 1497 ప్రారంభ ధరలో ఫ్లైట్ టికెట్ పొందొచ్చు. ఎయిర్ఏసియా అందిస్తున్న ఈ టికెట్ ధరల తగ్గింపు ఆఫర్ డిసెంబర్ 6 వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల టికెట్ బుక్ చేసుకోవాలని భావించే వారు వెంటనే ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఫ్లైట్ టికెట్ ఫ్రీ!
ఆఫర్లో భాగంగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఏప్రిల్ 13 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఎయిర్ఏసియా వెబ్సైట్ ద్వారా ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకొని ఈ ఆపర్ పొందొచ్చు. ఇంకా ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్లలో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు.
బ్యాంక్‌కు వెళ్లకుండా క్షణాల్లో అకౌంట్లోకి రూ.8 లక్షలు పొందండి.. ఎస్బీఐ బంపరాఫర్!
అలాగే న్యూపాస్ సభ్యులకు అదనంగా 20 శాతం తగ్గింపు లభిస్తుంది. బేస్ రేటుకు ఇది వర్తిస్తుంది. అలాగే ఎంపిక చేసిన రూట్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. టాటా న్యూ సూపర్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటేనే అదనపు తగ్గింపు ఆఫర్ వర్తిస్తుందని గుర్తించుకోవాలి. అలాగే వీరికి ఫ్రూట్ ప్లేటర్, ప్రియారిటీ బ్యాగేజ్ చెకిన్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
ఇకపోతే కంపెనీ ఇటీవలనే ఎయిర్ ఫ్లిక్స్ అనే సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ చెందిన అన్ని విమానాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఫ్లిక్స్ ద్వారా 6 వేల గంటల హై రెజల్యూషన్ కంటెంట్ పొందొచ్చు. 1000 అంతర్జాతీయ, దేశీ సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ వంటివి చూడొచ్చు. ఇకపోతే ఎయిర్ఏసియా అనేది ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ. ఇది టాటా గ్రూప్‌నకు చెందినది. 2014 జూన్ నెలలో ఎయిర్ఏసియా సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ కంపెనీ విమానాల్లో న్యూపాస్ లాయల్టీ సభ్యులకు ఫ్లష్ లెదర్ సీట్స్, గార్మైర్ హాట్ మీల్స్, ఇంకా పలు రకాల ప్రత్యేకమైన సేవలు అందుబాటులో ఉన్నాయి. కాగా టాటా గ్రూప్ ఇటీవలనే టాటా న్యూ అనే కొత్త సూపర్ యాప్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా టాటా గ్రూప్‌కు చెందిన పలు కంపెనీల సర్వీసులు పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, Flight Offers, Flight tickets, Flights, Tata, Tata Group