Flight Ticket Offers | విమాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ఏసియా తాజాగా సూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. న్యూ ఇయర్ (New Year) న్యూ డీల్స్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగాం విమాన టికెట్ ధర రూ. 1497 నుంచి ప్రారంభం అవుతోంది. బెంగూళూరు – కొచ్చి రూట్‌కు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే ఇతర మార్గాల్లో కూడా డిస్కౌంట్ రేటుకు విమాన టికెట్ (Flight Ticket) సొంతం చేసుకోవచ్చు.
ఎయిర్‌ఏసియా అందిస్తున్న ఈ విమాన టికెట్ల ఆఫర్ కేవలం పరిమిత కాల వరకే ఉంటుంది. ఈసేల్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. డిసెంబర్ 25 వరకే ఉంటుంది. ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకునే వారు 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14 వరకు ఎప్పుడైనా జర్నీ చేయొచ్చు. అందువల్ల ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంటుంది. అందువల్ల వెంటనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మంచి డీల్స్ సొంతం చేసుకోవచ్చు.
బైక్ కొంటే రూ.లక్షా 25 వేల డిస్కౌంట్.. మైండ్‌బ్లోయింగ్ ఆఫర్!
ఇకపోతే ఎయిర్ఏసియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే వారికి ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అంతేకాకుండా థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల ద్వారా విమాన టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా నియోపాస్ సభ్యులు కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే వీరికి ఉచితంగా ఫ్రూట్ ప్లాటర్ లభిస్తుంది. అలాగే ప్రియారిటీ చెకిన్, బ్యాగేజ్, బోర్డింగ్ వంటివి లభిస్తాయి. ఇంకా 8 శాతం వరకు నియో కాయిన్స్ కూడా పొందొచ్చు.
మధ్యతరగతికి కేంద్రం కొత్త ఏడాది అదిరే శుభవార్త? జనవరి 1 నుంచి..
Bank your new year resolutions now! Ring in 2023 with our #NewYearNewDeals sale, with fares starting ₹1,497! Book till 25 Dec for travel till 15 Apr 2023 on https://t.co/QiptjwMRjT or the AirAsia India mobile app. pic.twitter.com/bEwWXFlcLY
— AirAsia India (@AirAsiaIndia) December 23, 2022
ఎయిర్ఏసియా ఇండియా అనేది టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ. ఎయిర్ఏసియా ఇండియా 2014 జూన్ 12 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. 50కి పైగా డైరెక్ట్, 100 కనెక్టింగ్ రూట్లలో సర్వీసులు నడుపుతోంది. ఇకపోతే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈవో అలోక్ సింగ్ ఇటీవలనే ఎయిర్ ఏసియా హెడ్‌గా కూడా నియమతులయ్యారు.
కాగా విమానయాన కంపెనీలు కొత్త ఏడాది సందర్భంగా ప్రయాణికులకు ఆకర్షించడానికి ఆఫర్లు అందిస్తున్నాయి. ఇటీవలనే ఇండిగో కూడా ఇలాంటి ఫ్లైట్ టికెట్ ఆఫర్ ఒకటి తీసుకువచ్చింది. 2023 ప్రారంభ ధరతో విమాన టికెట్లను అందించింది. ఇప్పుడు ఈ కంపెనీ దారిలోనే ఎయిర్ఏసియా పయనిస్తోంది. కేవలం రూ. 1497కే ఫ్లైట్ టికెట్‌ను అందుబాటులో ఉంచింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫ్లైట్ జర్నీ చేయాల్సి ఉంటే.. మీ రూట్‌లో ఏమైనా ఆఫర్ ఉందేమో చెక్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight Offers, Flight tickets, Flights, Latest offers, Offers