కొంతమందికి చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. కానీ ధరలు చూసి వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కల నిజం చేసేందుకు ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ముందుకొచ్చింది. ఈ సంస్థ డొమెస్టిక్ టికెట్ ధరలపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫ్లాష్ సేల్ పేరుతో ఈ ఆఫర్ను ప్రారంభించింది. సేల్లో భాగంగా విమాన టికెట్లను రూ. 914 ప్రారంభ ధరతో అందిస్తోంది. అయితే దేశీయ ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఏషియా స్పష్టం చేసింది. 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్య ప్రయాణానికి.. ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 మధ్య అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఏషియా పేర్కొంది. అంటే, ఈ ఆఫర్ వినియోగించుకోవడానికి ఈ రోజే ఆఖరి రోజు.
ప్రయాణికులు ఎయిర్ ఏషియా ఇండియా అధికారిక వెబ్‌సైట్AirAsia.co.in, మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ ఏషియా ఆఫర్ చేసిన మార్గాలను పరిశీలిస్తే.. ఇంఫాల్ నుంచి కోల్‌కతా, ఇంఫాల్ నుంచి గౌహతి మార్గాల మధ్య ప్రయాణానికి అతి తక్కువగా రూ. 914కే టికెట్ ఆఫర్ చేస్తుండటం విశేషం.
ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్కు టికెట్ ధరను రూ .1,414గా నిర్ణయించింది. మరోవైపు, బెంగళూరు నుంచి గోవాకు, గోవా నుంచి హైదరాబాద్కు రూ .1,614 వద్ద టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. భువనేశ్వర్ నుంచి కోల్‌కతాకు రూ.1,714, పుణె నుంచి బెంగళూరు మార్గాల మధ్య రూ .1,814కే టికెట్లను ఆఫర్ చేస్తోంది.
డొమెస్టిక్ ప్రయాణాలకు మాత్రమే..
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో కొద్ది రోజుల పాటు విమానయాన ప్రయాణాలు నిలిపివేశారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో అన్ని విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించాయి. ప్రయాణికులను అట్రాక్ట్ చేసేందుకు వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. 2021 జులైలో ఎయిర్ ఏషియా ఇండియా, ట్రావెల్ ఇంటెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ఈ ఆఫర్లను ప్రకటించింది. రాబోయే మూడు నెలల్లో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉండటంతో దాదాపు 70% మంది ముందస్తు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారని ఎయిర్ ఏషియా సర్వేలో తేలింది. వారి ప్రయాణానికి ఉపయోగపడేలా ఈ ఫ్లాష్ సేల్ ఆఫర్ను తీసుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, Flight Offers, Flight tickets