హోమ్ /వార్తలు /బిజినెస్ /

Domestic Flight Fare Hike: విమాన ప్రయాణికులకు షాక్.. భారీగా ఛార్జీల పెంపు.. వివరాలివే

Domestic Flight Fare Hike: విమాన ప్రయాణికులకు షాక్.. భారీగా ఛార్జీల పెంపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర పౌరవిమానయాన శాఖ విమాన ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశీయ విమాన ప్రయాణానికి సంబంధించిన ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

విమాన ప్రయాణికులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ షాక్ ఇచ్చింది. దేశీయ విమాన ప్రయాణానికి సంబంధించిన ఛార్జీలను పెంచింది. ఈ మేరకు దేశీయ విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కరోనా ప్రత్యేక పరిస్థితులు, ఇందన ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఛార్జీలను 9.83 నుంచి 12.82శాతం వరకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. దేశీయ విమాన ఛార్జీలను పెంచడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి కావడం సామాన్యులను ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు.

Best Recharge Plans Under Rs 100: రూ. 100లోపే డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్.. Jio, Airtel, Vi అందించే బెస్ట్ ప్లాన్స్ ఇవే

Income Tax: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామన్న ఐటీ శాఖ.. వివరాలివే

పెరిగిన ఛార్జీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

-40 నిమిషాల లోపు ప్రయాణ సమయం ఉండే విమాన టికెట్‌ ధర కనిష్ఠ పరిమితి ఇప్పటి వరకు రూ.2,600 ఉండేది.. ఇప్పుడు ఆ ధరను రూ.2,900కు పెంచారు. ఇదే ప్రయాణ సమయానికి గరిష్ఠ పరిమితిని 12.82శాతం పెంచడంతో రూ.8,800కు చేరింది.

-40-60 నిమిషాల ప్రయాణ సమయం ఉండే విమాన టికెట్ ధర కనిష్ఠ పరిమితి రూ.3,300 ఉండగా.. రూ.3,700కు పెంచారు. గరిష్ఠ పరిమితిని రూ.11,000 పెంచారు.

-60-90 నిమిషాల ప్రయాణ సమయానికి టికెట్‌ కనిష్ఠ పరిమితి రూ.4,500 ఉండగా గరిష్ఠ పరిమితిని రూ.13,200కు పెంచారు.

-90-120 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.4,700ఉండగా ఇప్పుడు దాన్ని రూ.5,300కు పెంచారు. గరిష్ఠ పరిమితిని 12.3 శాతానికి పెంచారు.

-120-150 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.6,100 ఉండగా ఇప్పుడు రూ.6,700కు పెంచారు. గరిష్ఠ పరిమితి 12.42 శాతం పెరిగింది.

-150-180 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.7,400 ఉండగా.. ఇప్పుడు రూ.8,300కు పెంచారు. గరిష్ఠ పరిమితిని 12.74 శాతానికి చేరింది.

-180-210 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.8,700 ఉండగా ఇప్పుడు రూ.9,800లకు పెంచారు. గరిష్ఠ పరిమితిని 12.39 శాతానికి పెంచారు.

దీంతో పాటు మరి కొన్ని దేశీయ విమానాలను ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని 72.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా జులై 5 నుండి దేశీయ విమానాలు 65 శాతం సామర్థ్యంతో ప్రయాణిస్తున్నాయి. పెరిగిన ధరల తరువాత ఢిల్లీ నుండి ముంబై మధ్య కనీస వన్-వే ఛార్జీ రూ.4700 నుంచి రూ.5287 కి చేరింది. గరిష్ట ఛార్జీ రూ.13000 నుంచి రూ.14625 కి పెరిగింది.

First published:

Tags: Airport, Flight, Flight Offers, Flight tickets

ఉత్తమ కథలు