హోమ్ /వార్తలు /బిజినెస్ /

Air India-Tata: టాటా సన్స్​ చేతికి ఎయిరిండియా... భారత ఎయిర్​లైన్​ విభాగంలో ఈ సంస్థల మధ్యే పోటీ

Air India-Tata: టాటా సన్స్​ చేతికి ఎయిరిండియా... భారత ఎయిర్​లైన్​ విభాగంలో ఈ సంస్థల మధ్యే పోటీ

5. రాజ్‌కోట్-ఢిల్లీ విమానం డిసెంబర్ 30న ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగినట్లు అధికారులు తెలిపారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

5. రాజ్‌కోట్-ఢిల్లీ విమానం డిసెంబర్ 30న ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగినట్లు అధికారులు తెలిపారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Air India-Tata | ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ (Tata Group) చేతికి వచ్చింది. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏసియా ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్ వాటాలున్నాయి. ఇప్పుడు ఏఏ ఎయిర్‌లైన్స్ మధ్య పోటీ ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా (Air India) ప్రవేటీకరణపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ విమానయాన సంస్థను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు వేయగా.. టాటా సన్స్ (Tata Sons) అత్యధిక బిడ్​తో ఎయిరిండియాను​ దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఎం) కార్యదర్శి తుహిన్​కాంత పాండే అధికారికంగా వెల్లడించారు. టాటా సన్స్​ దాఖలు చేసిన బిడ్​ అన్నింటికంటే ఆకర్షనీయంగా ఉందని, అందుకే ఎయిరిండియాను టాటా గ్రూప్​కు కట్టబెట్టినట్లు ఆయన తెలిపారు. ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు టాటా సన్స్​ రూ. 18,000 కోట్లను వెచ్చించనుంది. అనేక ఊహాగాణాల మధ్య మళ్లీ 68 ఏళ్ల తర్వాత టాటా సన్స్​ ఎయిరిండియాను దక్కించుకుంది.

Special Trains: ప్రయాణికులకు అలర్ట్... దసరాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

ఎయిరిండియా టాటా సన్స్​కు దక్కడంతో ఢిల్లీలో అగ్రగామి విమానయాన సంస్థగా మారనుంది. ప్రస్తుతం, ఎయిరిండియా పరిధిలోని విస్తారా, ఎయిర్​ ఏషియా ఇండియా, ఎయిర్​ ఇండియా వంటి నాలుగు ఎక్స్​ప్రెస్​ విమానయాన సంస్థలు 40.17 శాతం మార్కెట్​ షేర్​ కలిగి ఉన్నాయి. వీటి మార్కెట్​ షేర్​ విలువ ఇండిగో సంస్థ కంటే మూడు శాతం ఎక్కువ కావడం విశేషం. దీంతో, దేశ రాజధాని ఢిల్లీలో ఎయిరిండియా, ఇండిగో ఎయిర్​లైన్స్​ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... 4 గంటలు బ్యాంకింగ్ సేవలు బంద్

మరోవైపు, కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే ఎయిర్​ ట్రాఫిక్​ పుంజుకుంటోంది. ఇది టాటా గ్రూప్​కు కలిసి రానుంది. కోవిడ్​–19 ఫస్ట్​వేవ్​ తర్వాత, టైర్​1 నగరాల కంటే టైర్ II, టైర్​ III నగరాల్లో ఎయిర్​ ట్రాఫిక్​ కాస్త పుంజుకుంది. ఇక, సెకండ్​ వేవ్ ప్రారంభమైనప్పుడు, ఎయిర్​ ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీ, ముంబై, బెంగుళూరు నగరాల్లో ఎయిర్​ ట్రాఫిక్​ పెరిగింది.

ఇండిగోకు బలమైన పోటీనిచ్చే అవకాశం


కాగా, ప్రస్తుతం టాటా సన్స్​ చేతుల్లోకి వెళ్లిన ఎయిర్ ఇండియాతో ఇండిగో, స్పైస్‌జెట్, గో ఫస్ట్​తో పోటీ పడనున్నాయి. ప్రధానంగా ఈ నాలుగు దేశీయ ఎయిర్​లైన్స్​ మద్యే పోటీ ఉండే అవకాశం ఉంది. టాటా సన్స్​ చేతిలోకి ఎయిరిండియా వెల్లడంతో డొమెస్టిక్​ విభాగంలో నంబర్​ 1 స్థానంలో కొనసాగుతున్న ఇండిగో సంస్థ మొదటిసారిగా బలమైన పోటీని చూడనుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Air India, Airlines, Ratan Tata, Tata, Tata Group

ఉత్తమ కథలు