ఎయిర్ ఇండియాకి కలిసొచ్చిన పాకిస్థాన్ నిర్ణయం... అటు విమానం వెళ్తే... లాభాలే లాభాలు

Air India : అసలే ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి బాలేదు. అన్నీ అప్పులే. ఇలాంటి సమయంలో... పాకిస్థాన్ తన ప్రయోజనం కోసం నిర్ణయం తీసుకుంటే... అది ఎయిర్ ఇండియాకి మేలు చేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 11:58 AM IST
ఎయిర్ ఇండియాకి కలిసొచ్చిన పాకిస్థాన్ నిర్ణయం... అటు విమానం వెళ్తే... లాభాలే లాభాలు
ఎయిర్ ఇండియా విమానం (File)
  • Share this:
పాకిస్థాన్ తన పరిధిలోని ఆకాశంలో... విదేశీ విమాన రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఫలితంగా ఇకపై ఎయిర్ ఇండియా విమానాలు... పాకిస్థాన్ గగన తలం పైనుంచి కూడా విదేశాలకు వెళ్లగలవు. పాకిస్థాన్ నిర్ణయం వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఖర్చు రూ.20 లక్షల వరకు తగ్గుతుంది. అలాగే ఇండియా నుంచీ యూరప్ వెళ్లే విమానం ఖర్చు రూ.5 లక్షల దాకా తగ్గుతుంది. గగనతలాన్ని పాకిస్థాన్ అనుమతించకముందు... ఎయిర్ ఇండియా విమానాలు... పాకిస్థాన్ వైపుగా కాకుండా... చుట్టూ తిరిగి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. అమెరికాకు వెళ్లే విమానాలకు 90 నిమిషాల ఎక్కువ సమయం పట్టేది. అందువల్ల ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అయ్యేది.

ఇప్పుడు పాక్ గగనతలం అనుమతించడం వల్ల... అడ్డ దారిలో వెళ్లినట్లుగా... డైరెక్టుగా విమానాలు అమెరికా, యూరప్ వైపు ఎగిరేందుకు వీలు కలుగుతోంది. అందువల్లే ఫ్యూయల్ ఖర్చు తగ్గుతోంది. ఐతే... పాకిస్థాన్... బ్యాంకాక్, ఢిల్లీ, కౌలాలంపూర్ నుంచీ వెళ్లే విమానాలకు మాత్రం తమ గగనతలంపై పర్మిషన్ ఇవ్వలేదు. అది కూడా ఇచ్చేస్తే, ఎయిర్ ఇండియాకి మరింత కలిసొస్తుంది.


బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్థాన్ తన గగనతలంపై వివిధ దేశాలకు ఆంక్షలు విధించింది. ఫిభ్రవరిలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థాన్ అధీనంలో 11 వాయు మార్గాలు ఉండగా కేవలం రెండు రూట్లలో మాత్రమే భారత విమానాలు ప్రయాణించేందుకు అనుమతించింది. తాజాగా పాక్ ఇప్పటివరకు విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తేసింది. మంగళ వారం నుంచి అన్నిరూట్లలో విమానాలు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. పాకిస్థాన్ గగనతలం మూసివేయడం వల్ల వివిధ అంతర్జాతీయ విమానాలను తిరిగి మార్చుకోవాల్సి రావడంతో సుమారు రూ.491 కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని చూసిన ఎయిర్ ఇండియాకు పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద ఉపశమనం కలిగినట్లైంది.
First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>