హోమ్ /వార్తలు /బిజినెస్ /

Air India: ఎయిర్ ఇండియాకు కొత్త పేరు.. అదిరిపోయిందిగా..

Air India: ఎయిర్ ఇండియాకు కొత్త పేరు.. అదిరిపోయిందిగా..

ఎయిర్ ఇండియాకు కొత్త పేరు.. అదిరిపోయిందిగా..

ఎయిర్ ఇండియాకు కొత్త పేరు.. అదిరిపోయిందిగా..

Vihaan | ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం చూస్తే.. కంపెనీ పేరు మారబోతోంది. ఇకపై ఎయిర్ ఇండియా.. విహాన్‌గా మారుతుంది. అలాగే కంపెనీ తన దీర్ఘకాలిన లక్ష్యాలను, ప్రణాళికలను కూడా ప్రకటించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Tata Group | టాటా గ్రూప్‌కు చెందిన  ఎయిర్ ఇండియా (Air India) తాజాగా కీలక ప్రకటన చేసింది. పేరు మార్చుకోబోతున్నట్లు వెల్లడించింది. కొత్త పేరుతో ప్రయాణికుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది.  టాటా గ్రూప్ కొత్త పేరు ఏంటో కూడా వెల్లడించింది. ఇకపై ఎయిర్ ఇండియా పేరు విహాన్‌గా (Vihaan.AI) మారబోతోంది. భారతీయ మూలలతో ప్రపంచ స్థాయి గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మరోసారి సత్తా చాటేందుకు, స్థిరపడేందుకు సమగ్రమైన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది.

  కొత్త ప్రణాళికలలో భాగంగా ఎయిర్ ఇండియా తన నెట్‌వర్క్, ఫ్లీట్ రెండింటినీ మరింత వృద్ధి చేయనుంది. అలాగే కస్టమర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం, విశ్వసనీయత, సమయ పాలన, పనితీరును మెరుగుపరచడం, సాంకేతికత, స్థిరత్వం , కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులపై దృష్టి వంటి అంశాలు అన్నింటికీ కంపెనీ అధిక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. పరిశ్రమలో ప్రతిభతో రాణించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

  కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ .. ఈరోజు నుంచి..

  అలాగే టాటా ఎయిర్ ఇండియా పెద్ద టార్గెట్‌ను నిర్దేశించుకుంది. వచ్చే ఐదేళ్లలో అధిక మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే 5 సంవత్సరాలలో ఎయిర్ ఇండియా దేశీ మార్కెట్‌లో తన వాటాను కనీసం 30 శాతానికి పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇది 8 శాతంగా ఉంది. అదే సమయంలో ప్రస్తుత మార్కెట్ వాటాలో అంతర్జాతీయ సర్వీసులను గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది.

  పోస్టాఫీస్‌లో చౌక వడ్డీకే రుణాలు.. ఇంకా రూ.330 పొదుపుతో రూ.16 లక్షలు!

  ఎయిర్ ఇండియా తన ఉద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ‘విమానయాన సంస్థ తక్షణ దృష్టి ప్రాథమిక అంశాలను పరిష్కరించడం, వృద్ధికి దోహదపడే నిర్ణయాలపైనే ఉంది. గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్‌గా ఎదగడానికి దీర్ఘకాల దృష్టితో ముందుకు వెళ్తాం’ అని కంపెనీ పేర్కొంది.

  ‘ఇది ఎయిర్ ఇండియా చరిత్రాత్మక మార్పునకు నాంది. కొత్త శకానికి తొలి అడుగు. కొత్త ఉద్దేశ్యంతో అద్భుతమైన ఉత్సాహంతో ధైర్యవంతమైన కొత్త ఎయిర్ ఇండియా కోసం మేము పునాది వేస్తున్నాం’ అని ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకప్పుడు ఎంతటి ఘన కీర్తిని కలిగి ఉందో.. మళ్లీ ప్రపంచ పటంలో ఎయిర్ ఇండియాకు అదే స్థానాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం గతంలో టాటాల నుంచి ఎయిర్ ఇండియాను తీసుకొని జాతికి అంకితం చేసింది. మళ్లీ తర్వాత ఎయిర్ ఇండియా సొంత గూటికి చేరింది. ఇప్పుడు ఏకంగా కంపెనీ పేరును మార్చబోతోంది. కొత్త ప్రణాళికతో దూసుకుపోనుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Air India, Flights, Ratan Tata, Tata, Tata Group

  ఉత్తమ కథలు