Air India offer: టేకాఫ్‌కు 3 గంటల ముందు టికెట్ బుక్ చేస్తే 40% డిస్కౌంట్

Air India offer | ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఎమర్జెన్సీగా ప్రయాణించాలనుకుంటే... వారికి టికెట్ ధరలో 40 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

news18-telugu
Updated: May 10, 2019, 5:44 PM IST
Air India offer: టేకాఫ్‌కు 3 గంటల ముందు టికెట్ బుక్ చేస్తే 40% డిస్కౌంట్
మీరు విమాన ప్రయాణికులా? తరచుగా విమానాల్లో ప్రయాణిస్తుంటారా? అయితే, మీకు ఈ వార్త చేదుగానే ఉంటుంది.
  • Share this:
విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎయిర్ ఇండియా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. విమానం టేకాఫ్ అవడానికి మూడు గంటల ముందు టికెట్లు బుక్ చేసే ప్రయాణికులకు 40% డిస్కౌంట్ ఇవ్వనుంది. అత్యవసరంగా ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుందని ఎయిర్ ఇండియా భావిస్తోంది. అదే రోజు ప్రయాణించడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే ఫేర్ భారీగా ఉండటం మామూలే. అయితే టికెట్ ధరలు భారీగా ఉండటంతో మరీ అత్యవసరమైతే తప్ప టికెట్ బుక్ చేసుకోరు ప్రయాణికులు. అలాంటివారికోసమే ఈ ఆఫర్ ప్రకటించింది ఎయిర్ ఇండియా. ముందుగా ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఎమర్జెన్సీగా ప్రయాణించాలనుకుంటే... వారికి టికెట్ ధరలో 40 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Read this: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

గురువారం ఎయిర్ ఇండియా హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కమర్షియల్ రివ్యూ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఎయిర్ ఇండియా బుకింగ్ కౌంటర్స్‌, ఎయిర్ ఇండియా మొబైల్ యాప్, ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, ట్రావెల్ ఏజెంట్ల దగ్గర కొన్న టికెట్లకు ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. ఇక గత నెలలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇరుక్కుపోయిన జెట్ ఎయిర్‌వేస్ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా స్పెషల్ ఫేర్స్ ప్రకటించడం విశేషం.

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివేWhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 10, 2019, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading