హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Group: హైదరాబాదీలకు కొత్త సర్వీసులు.. వచ్చే నెల నుంచి..

Tata Group: హైదరాబాదీలకు కొత్త సర్వీసులు.. వచ్చే నెల నుంచి..


హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Hyderabad | ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Air India | టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ అందించింది. కొత్త ఫ్లైట్ సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటిచింది. దోహా, దుబాయ్‌లో జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ దృష్ట్యా టాటా గ్రూప్ (Tata Group)) ఎయిర్‌లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా (Air India) ముంబై, హైదరాబాద్, చెన్నై నుంచి దోహాకు నేరుగా విమానాలను నడుపనున్నట్లు వెల్లడించింది. ప్రతి వారం 20 కొత్త విమానాలు (Flight) నడుపుతాయని, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల నుంచి దోహాకు ఈ ఫ్లైట్స్ వెళ్తాయని కంపెనీ తెలిపింది. నవంబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఖతార్‌లో జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ కారణంగా డిమాండ్ పెరగొచ్చని, అందుకే దోహాకు నేరుగా విమానాలను నడుపుతున్నట్లు కంపెనీ వివరించింది.ఎయిర్ ఇండియా ప్రకారం.. ఈ కొత్త ఫ్లైట్ సర్వీసులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 30 నుంచి ముంబై, హైదరాబాద్ , చెన్నై నుండి ఖతార్ రాజధాని దోహాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ముంబై నుంచి ప్రతి వారం 13 విమానాలు, హైదరాబాద్ నుంచి ప్రతి వారం 4 విమానాలు, చెన్నై నుంచి ప్రతి వారం 3 విమానాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ విమానాలు ఢిల్లీ - దోహా విమానాలకు అదనంగా ఉంటాయి.
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా
కాగా ఎయిర్ ఇండియా గత నెలలో 14 కొత్త విమానాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - బెంగళూరు, ముంబై - చెన్నై మార్గాలకు 2 ఫ్రీక్వెన్సీలను జత చేసింది. ఇవి కాకుండా ముంబై - బెంగళూరు మార్గంలో ఫ్రీక్వెన్సీని పెంచారు. ఇప్పుడు మరిన్ని విమానాలు సర్వీసులోకి వస్తున్నాయని, ఆ తర్వాత నెట్‌వర్క్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని కంపెనీ పేర్కొంది.
కేవలం రూపాయితో రూ.54 కోట్లు.. ఇదెక్కడి మ్యాజిక్ రా మావ


ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు భారత్ - ఖతార్ మధ్య బలమైన కనెక్టివిటీని ఎయిర్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారతదేశంలోని ఫుట్‌బాల్ గేమ్ ప్రేమికులు ఖతార్‌లోని స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూడటానికి ఇష్టపడతారని, అందుకే మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, ఇబ్బంది లేకుండా చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

First published:

Tags: Air India, Flight, Foot ball, Tata, Tata Group

ఉత్తమ కథలు