18% జీఎస్‌టీ శ్లాబులోకి టీవీలు, ఏసీలు... తగ్గనున్న ధరలు

ఓవైపు కంపెనీలు ఏసీలు, టీవీల ధరల పెంచాలని నిర్ణయించిన సమయంలో... వాటిపై జీఎస్‌టీ 10% తగ్గడం సామాన్యులకు శుభవార్తే.

news18-telugu
Updated: December 7, 2018, 4:15 PM IST
18% జీఎస్‌టీ శ్లాబులోకి టీవీలు, ఏసీలు... తగ్గనున్న ధరలు
ప్రతీకాత్మక చిత్రం (Getty Images)
  • Share this:
ఏసీలు, టీవీల ధరలు తగ్గనున్నాయి. అవి మాత్రమే కాదు... డిష్‌ వాషర్స్, డిజిటల్ కెమెరాల రేట్లూ తగ్గుతాయి. ఇప్పటి వరకు వీటిపై 28% జీఎస్‌టీ వేస్తుండగా... డిసెంబర్ 17న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరగబోయే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో వాటిని 18% శ్లాబ్‌లోకి తీసుకురానున్నారు. అంతేకాదు... 28% శ్లాబ్‌ను తొలగించి అత్యధికంగా 18% శ్లాబ్‍నే కొనసాగించే ప్రతిపాదనపై చర్చ జరగనుంది.

లోక్‌సభ ఎన్నికలకు నాలుగు నెలల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. అయితే దీని వల్ల ప్రభుత్వానికి జీఎస్‌టీ రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతుంది. వార్షికంగా సుమారు రూ.10,000 నుంచి రూ.11,000 కోట్ల ఆదాయం కోల్పోనుంది. కొన్ని వస్తువులను 18 శాతం నుంచి 5 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లోకి తీసుకురానున్నారు. అయితే ఓవైపు కంపెనీలు ఏసీలు, టీవీల ధరల పెంచాలని నిర్ణయించిన సమయంలో... వాటిపై జీఎస్‌టీ 10% తగ్గడం సామాన్యులకు శుభవార్తే.

ఇవి కూడా చదవండి:

ఎస్‌బీఐ కస్టమర్లకు ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్... ఎలాగో తెలుసుకోండి

ఆధార్ కార్డు వద్దా? అయితే వెనక్కి తీసుకోవచ్చు...

ఉద్యోగం చేయడానికి ఈ 10 కంపెనీలు బెస్ట్

గుడ్ న్యూస్: ఇక వాట్సప్‌లోనూ డార్క్ మోడ్ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్: కొనాల్సిన ఫోన్లు ఇవే...
First published: December 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading