భారత విమానయాన రంగం వృద్ధి బాటలో నడుస్తోంది. కరోనా సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న ఇండియన్ ఎయిర్‌లైన్(Indian Airlines) బిజినెస్ సాధారణ స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లైట్ జర్నీ (Flight Journey) చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎయిర్‌ఏషియా (AirAsia). ఈ ఎయిర్‌లైన్ కంపెనీ ఏకంగా 50 లక్షల టికెట్లను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. విమానంలో ప్రయాణించాలనే ఎంతోమంది కలను ఫ్రీగా నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తోంది.
వచ్చే ఏడాది కొత్త సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ ఏషియా ఈ ఆఫర్లను అనౌన్స్ చేసింది. ‘ఫ్రీ సీట్ సేల్’ పేరుతో అందిస్తున్న ఈ ఆఫర్లో భాగంగా ఎయిర్‌లైన్స్ రూట్స్‌లో 50 లక్షల సీట్లను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. లబ్ధిదారులు వచ్చే ఏడాది 2023 జనవరి 1 నుంచి 2023 అక్టోబర్ 28 వరకు విమానంలో ప్రయాణించవచ్చు. టికెట్ల సేల్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ 25 వరకు కొనసాగుతుంది.
* అంతర్జాతీయ నగరాలకు ప్రయాణించే అవకాశం
ఫ్రీ సీట్ సేల్ ఆఫర్‌లో ఫ్లైట్ సీట్ బుక్ చేసుకున్నవారు ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ప్రయాణించవచ్చు. కొన్ని అంతర్జాతీయ రూట్లలో కూడా ఫ్రీ టికెట్లను పొందవచ్చు. వీటిలో బ్యాంకాక్, క్రాబీ, ఫుకెట్, న్హా ట్రాంగ్, లుయాంగ్ ప్రాబాంగ్, నాకోర్న్, నాకోర్న్ శ్రీతామత్, మాండలే, నమ్ పెన్, పెనాంగ్ నగరాలు ఉన్నాయి.
ఎక్కువ దూరం ప్రయాణించే ఎయిర్‌ఏషియా సిస్టర్ ఎయిర్‌లైన్స్ AirAsia X, థాయ్ AirAsia X లలో కూడా ఆఫర్లు ఉన్నాయి. 2022 అక్టోబర్ 3 నుంచి 2023 అక్టోబర్ 23 మధ్య ప్రయాణించడానికి ఈ ఆఫర్లు ఉపయోగపడతాయి. ఆఫర్ పూర్తి వివరాలకు ఎయిర్‌ఏషియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
* టికెట్లు బుక్ చేసుకునే ప్రక్రియ
ఎయిర్‌ఏషియా 50 లక్షల ఫ్రీ టికెట్స్ ఆఫర్‌ను సంస్థ యాప్ లేదంటే అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. పోర్టల్‌కు వెళ్లి అక్కడ ‘ఫ్లైట్స్’ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇష్టమైన నగరానికి సీటును బుక్ చేసుకోవచ్చు. ఫ్రీ టికెట్‌ను మరే ఇతర వ్యక్తికి ట్రాన్స్‌పర్ చేయటం కుదరదు. అలాగే టికెట్‌ను నిర్ణీత వ్యవధిలోనే కచ్చితంగా ఉపయోగించాలి.
ఇది కూడా చదవండి : పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీస్‌గా రతన్ టాటా, మరో ఇద్దరు
ఎయిర్‌ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, కరెన్ చాన్ మాట్లాడుతూ.. క్లిష్టసమయాల్లో తోడుగా ఉన్న కస్టమర్లకు అతి పెద్ద ఫ్రీ సీట్ సేల్ ఆఫర్‌తో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా ఇష్టపడే అనేక రూట్లలో సేవలు తిరిగి ప్రారంభించామని తెలిపారు. గ్రేట్ వ్యాల్యూ, ఛాయిస్ కోసం కొత్త రూట్లలో కూడా సేవలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
21వ వార్షికోత్సవం, ప్రపంచవ్యాప్తంగా కొత్త రూట్లలో సేవలు ప్రారంభించే సందర్భాలను పురస్కరించుకుని ఆఫర్ ప్రకటించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విమాన ప్రయాణం అందుబాటులో ఉండేలా ఎప్పటిలాగే ఉత్తమమైన ధరల అందించేందుకు ప్రయత్నిస్తామని కరెన్ చాన్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airlines, Flight Offers, Flight tickets, Travelling