కాలం మారినా.. సాంకేతికత పెరిగినా.. రైతుల కష్టాలు తీరడం లేదు. ఆరుగాలం కష్టపడి.. ప్రకృతి విపత్తులను తట్టుకొని.. పంట పండించినా.. మార్కెట్‌లో సరైన ధరలేక నష్టాలు వస్తున్నాయి. చాలా మందికి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రావడం లేదు. ఐతే దీనికి ప్రధాన కారణం.. రైతులంతా ఒకే సంప్రదాయ పంటలను ఎక్కువగా పండించడం...! తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మొక్కజొన్న, వరి, పత్తి, మిర్చి వంటి పంటనే ఎక్కువగా పండిస్తారు. కానీ కొందరు రైతులు పక్కా ప్రణాళికతో వాణిజ్య పంటలను పండించి.. లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఓ రైతు కూడా ఏడాదికి నాలుగు పంటలు పండిస్తూ.. ఆరు లక్షల ఆదాయం పొందుతున్నాడు.
బంగారం కొనాలనుకునే వారికి పిడుగులాంటి వార్త.. రూ.60 వేలు దాటేసిన ధర, ఈరోజు రేట్లు
భరత్‌పూర్ జిల్లా కుమ్హెర్ మండలం బైలారా గ్రామానికి చెందిన భజన్ లాల్.. గతంలో గోధుమలు, ఆవాలు పండించేవాడు. వాటితో పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. ఎందుకంటే భరత్‌పూర్‌లో చాలామంది రైతులు ఈ పంటలను పండిస్తారు. ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల రేటు తక్కువగా లభించేది. ఇలా అయితే కాదని.. కొత్త తరహా పంటలను పండించాలని భజన్ లాల్ నిర్ణయించుకున్నాడు. అది కూడా ఒకే ఏడాది నాలుగు పంటలను పండిస్తున్నాడు. అంటే ఏడాదికి రెండు చొప్పున.. ఒకే భూమిలో రెండు పంటలు వేస్తూ.. మొత్తం నాలుగు పంటలను సాగు చేస్తున్నాడు. ఈ విధానంతో భజన్ లాల్ ఆదాయం పెరగింది. ఆర్థిక పరిస్థితి కూడా మారింది.
ముందుగా కూరగాయల్లో బెండ సాగు ప్రారంభించినట్లు రైతు తెలిపారు. దాని మధ్యలోనే పెసలు పండించారు. ఇలా ఒకేసారి రెండు పంటలు వేశారు భజన్ లాల్. పంటల చేతికి వచ్చిన తర్వాత.. బెండకాయలను రూ.1.5 లక్షలు, పెసర్లను రూ.35వేలకు విక్రయించారు. ఆ రెండు పంటలు పూర్తయ్యాక... కొత్తిమీర, టమాటా సాగు చేశారు. ఇందులో కొత్తిమీరను 85వేలకు అమ్మారు. టామటా పంట కూడా సిద్ధంగా ఉందని త్వరలో.. మార్కెట్‌కు తీసుకెళ్తామని చెప్పారు బంటు. ఇలా ఏడాదికి 5 నుంచి 6 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. ఇంకో విశేషమేమంటే.. పంట సాగులో ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడరు. కేవలం సేంద్రీయ ఎరువులే ఉపయోగిస్తున్నారు.
తను సాగు విధానాన్ని చూసి.. ఇప్పుడు చాలా మంది రైతులు ఇదే ఫార్ములా అనుసరిస్తున్నారు. ఏడాదికి 4 సార్లు పంటలు పండిస్తూ.. రెట్టింపు లాభాలను పొందుతున్నారు. రైతులు ఎప్పుడూ సంప్రదాయ పంటల వెనకాలే వెళ్లకుండా.. వాణిజ్య పంటలను సాగుచేస్తే.. వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం/పంట సాగును ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత సంబంధిత నిపుణులని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Farmers, Rajasthan