హోమ్ /వార్తలు /business /

అకాల వర్షాలతో మిర్చి రైతుల కంటన్నీరు..

అకాల వర్షాలతో మిర్చి రైతుల కంటన్నీరు..

ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులు

ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులు

Andhra Pradesh: కర్నూలు మార్కెట్‌కు అత్యధికంగా మిర్చి వస్తోంది. ఎండు మిర్చి క్వింటా రూ.47,699 ధర పలుకుతుండడంతో. తెలంగాణ రాష్ట్రం నుంచి కర్నూలు మార్కెట్‌కు అత్యధికంగా మిర్చి తీసుకొస్తున్నారు రైతులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

కర్నూలు మార్కెట్‌కు అత్యధికంగా మిర్చి వస్తోంది. ఎండు మిర్చి క్వింటా రూ.47,699 ధర పలుకుతుండడంతో. తెలంగాణ రాష్ట్రం నుంచి కర్నూలు మార్కెట్‌కు అత్యధికంగా మిర్చి తీసుకొస్తున్నారు రైతులు. జోగులాంబ గద్వాల్, ఇటిక్యాల మండలం కోదండాపురం గ్రామానికి చెందిన సత్య అనే రైతు తన పొలంలో పండించిన ఎండుమిర్చిని కర్నూలు మార్కెట్ యార్డ్ కి అమ్మకానికి తెచ్చిన 1.05 క్వింటాళ్ల ఎండు మిర్చి క్వింటా రూ.47,699 పలికింది.

అదే విధంగా అలంపూర్‌ మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన సుశాంత్‌ అనే రైతు 2.45 క్వింటాళ్లు ఎండుమిర్చిని కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకురాగా క్వింటా రూ.47,099 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు.అదే రీతిలో గత వారంలో తెలంగాణ రాష్ట్రం నెలుపల్లి గ్రామానికి చెందిన సూర్యదాస్‌ అనే రైతు యార్డుకు 1.40 క్వింటాళ్ల బ్యాడిగ రకం ఎండు మిర్చి అమ్మకానికి తీసుకొచ్చారు. నాణ్యతను బట్టి ఈ.నామ్‌ ద్వారా క్వింటాకు గరిష్ఠంగా రూ.48,699 ధర లభించింది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డులో కనిష్ఠ ధర క్వింటా రూ.10,501, మధ్యస్థ ధర రూ.22,699గా నమోదైంది.

మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఎండుమిర్చి గుంటూరుకు తరలిస్తుండగా తెలంగాణ నుంచి రైతులు ఎండుమిర్చిని కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన రైతులకు అధిక ధర లభించడం విశేషం.అదే విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఎండుమిర్చి రైతులు కర్నూల్ మార్కెట్ యార్డులో బంగారంతో పోటీపడుతున్న ఎండుమిర్చిని కర్నూల్ మార్కెట్ యార్డ్ కి తరలించాలని ఆశించిన సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులను నిండా ముంచేత్తాయి.

గత రెండ్రోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 6861.66 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. ఆళ్లగడ్డలో 1725 హెక్టార్లు, రుద్రవరం(1567), కోవెలకుంట్ల(808), చాగలమర్రి(779), ఉయ్యాలవాడ (668), శిరివెళ్ల (325.2), గోస్పాడు(295), బనగానపల్లి (170), గడివేముల(145), మిడ్తూరు( 139), బండిఆత్మకూరు(120), జూపాడుబంగ్లా (54), సంజామల మండలంలో 60 హెక్టార్లలో మొక్కజొన్న, వరి, కొర్ర, మినుము, ఆముదం తదితర పంటలు దెబ్బతిన్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు