హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేదేలే... ఇంకా పెరిగే ఛాన్స్

Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేదేలే... ఇంకా పెరిగే ఛాన్స్

Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేదేలే... ఇంకా పెరిగే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేదేలే... ఇంకా పెరిగే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Petrol Diesel Prices | పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేదేలే అంటున్నాయి. ఎనిమిది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) పెరగకపోయినా తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు.

  పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) తగ్గుతాయన్న ఆశతో ఉన్నారా? అయితే మీ ఆశలు ఫలించే అవకాశం లేదు. పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలతో ముడిపడి ఉన్నాయన్న సంగతి తెలిసిందే. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు (Oil Prices) భారీగా పెరిగాయి. చమురు సరఫరా నిలిచిపోవడం మరో కారణం. భారత ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోవడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరల్ని కిందకు తీసుకొస్తాయని వార్తలొచ్చాయి. పెట్రోలు, డీజిల్‌పై పన్నులను తక్షణమే తగ్గించాలన్న ఆలోచనలో ప్రభుత్వం లేదని, ఇంధనాలపై సుంకాన్ని తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనతో ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుకూలంగా లేదని తాజాగా వార్తలొస్తున్నాయి.

  అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై మంత్రిత్వ శాఖల అధికారులు ఇటీవల చమురు మార్కెటింగ్ కంపెనీలతో చర్చించారు. పెరుగుతున్న ధరలను ఎదుర్కోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కంపెనీలను కోరారు. కానీ పరిస్థితి చూస్తుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించట్లేదు.

  Aadhaar Card: ఆధార్ కార్డ్ మర్చిపోతే సింపుల్‌గా ఇలా డౌన్‌లోడ్ చేయండి

  కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.27.90, లీటర్ డీజిల్‌పై రూ.21.80 ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది. గతంలో ఎక్సైజ్ సుంకం ఇంకా ఎక్కువగా ఉండేది. గతేడాది నవంబర్‌లో దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సుంకం తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగొచ్చాయి. కానీ... ఇటీవల చమురు ధరలు పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించినా ఆ ఫలితం ఎక్కువ రోజులు లేదు.

  ఏప్రిల్ 1న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ కేవలం రూ.53.34 మాత్రమే. రవాణా ఛార్జీ 20 పైసలు, ఎక్సైజ్ డ్యూటీ రూ.27.90, వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ రూ.16.54, డీలర్ కమిషన్ రూ.3.83 కలిపి లీటర్ పెట్రోల్ ఏప్రిల్ 1న రూ.101.81 ధరకు చేరుకుంది. అంటే ప్రస్తుతం లీటర్‌కు చెల్లిస్తున్న ధరలో సగం పన్నులు, ఇతర ఖర్చులే ఉన్నాయి. ఇక డీజిల్ విషయానికి వస్తే ఏప్రిల్ 1న ఢిల్లీలో లీటర్ డీజిల్ బేస్ ప్రైస్ కేవలం రూ.54.87 మాత్రమే. రవాణా ఛార్జీ 22 పైసలు, ఎక్సైజ్ డ్యూటీ రూ.21.80, వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ రూ.13.60, డీలర్ కమిషన్ రూ.2.58 కలిపి లీటర్ డీజిల్ ఏప్రిల్ 1న రూ.93.07 ధరకు చేరుకుంది.

  Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు

  గత ఎనిమిది రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ అంతకుముందే రూ.10 వరకు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూస్తే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.105.49. న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.96.67. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.104.77. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.79.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Diesel price, Oil prices, Petrol Price, Petrol prices, Petrol rate

  ఉత్తమ కథలు