ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ (Tata Group) చేజిక్కించుకుంది. డిసెంబర్ లోగా అధికారికంగా ఎయిర్ ఇండియా (Air India) టాటా సన్స్ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏంటీ? టాటా సన్స్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఎయిర్ ఇండియా సంస్థలో ఉద్యోగులు, సంస్థ విధానాలు, ఐటీ, ఇంజనీరింగ్, విమానాల అనుసంధానం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సవాళ్లు ఉన్నాయి. వీటన్నింటికన్నా ముందు షెడ్యూల్ ఓవర్‌ల్యాప్ సవాల్‌ను టాటా సన్స్ ఎదుర్కోనుంది. విమానయాన రంగంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. ఒకరి ట్రాఫిక్‌ను మరొకరు చేజిక్కించుకోవడం చుట్టే బిజినెస్ జరుగుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రధానంగా అంతర్జాతీయ ఫ్లైట్లను నడుపుతోంది.
ప్రస్తుతం టాటాల చేతుల్లో రెండు ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. ఈ రెండూ ఒకదానితో మరొకటి పోటీ పడకుండా ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తున్నాయి. ఒకటేమో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో టై అప్ అయి ఫుల్ సర్వీస్ ప్రీమియమ్ క్యారియర్‌ను నడుపుతూ మెట్రో సిటీస్‌కు విస్తరిస్తుంటే, మరొకటి మలేషియాకు చెందిన ఎయిర్ ఏసియా మోడల్‌ను అయిన లోకాస్ట్ ఫిలాసఫీతో ఫ్లైట్లను నడుపుతోంది. లాక్డౌన్ తర్వాత కొత్త రూట్లలో నాన్ స్టాప్ ఫ్లైట్లు వచ్చాయి. ఇప్పుడు టాటా గొడుగు కింద ఉన్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఎయిర్ ఏసియా సంస్థలు 150 డొమెస్టిక్ రూట్లలో ఫ్లైట్లను నడుపుతున్నాయి.
Special Trains: ప్రయాణికులకు అలర్ట్... దసరాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
వీటిలో ఎయిర్ ఇండియా 121, ఎయిర్ ఏసియా ఇండియా 46, విస్తారా 42, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 13 రూట్లలో ఫ్లైట్లు నడుపుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్లు కలిసే రూట్లు మూడు ఉన్నాయి. ఢిల్లీ-జైపూర్ రూట్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ వారానికి ఒకసారి సేవలందిస్తే, ఎయిర్ ఇండియా వారానికి 11 ఫ్లైట్లు తిప్పుతోంది. ఇక ఢిల్లీ-వారణాసి రూట్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్లు వారానికి మూడుసార్లు తిరిగితే, ఎయిర్ ఇండియా ఫ్లైట్లు వారానికి 18 సార్లు తిరుగుతాయి. ఇక హైదరాబాద్-విజయవాడ రూట్లో రెండు ఎయిర్‌లైన్స్ వారానికి మూడు సార్లు ఫ్లైట్లు నడుపుతున్నాయి.
Aadhaar Card Fraud: ఆధార్ కార్డు విషయంలో వెంటనే ఈ పనిచేయకపోతే మోసపోతారు జాగ్రత్త
ఇక ఢిల్లీ-వారణాసి రూట్లో తప్ప ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఏ రూట్లో కూడా ఎయిర్ఏసియా, విస్తారా ఎయిర్‌లైన్స్‌తో పోటీపడట్లేదు. కొన్ని నెలలుగా ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ ఫుల్ సర్వీస్ క్యారియర్స్‌లో మార్కెట్ షేర్‌ను పెంచుకుంటూ ఉండటం విశేషం. విస్తారా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్ నడుపుతున్న బెంగళూరు-గువాహతి, బెంగళూరు-చండీగఢ్, ముంబై-చండీగఢ్, కోల్‌కతా-పూణె, ఢిల్లీ-చండీగఢ్, బాగ్డోగ్రా-దిబుగఢ్ రూట్లలో ఎయిర్ ఇండియా కూడా ఫ్లైట్లు నడుపుతోంది.
టాటా చేతుల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ నడిపే ఫ్లైట్స్ షెడ్యూల్ ఓవర్‌ల్యాప్ కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఉదాహరణకు బెంగళూరు-ఢిల్లీ లాంటి రూట్లలో విస్తారా, ఎయిర్ ఏసియా ఇండియా ఎయిర్‌లైన్స్ వెంటవెంటనే ఫ్లైట్స్ నడుపుతున్నాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా వచ్చి చేరింది. ఈ నాలుగు ఎయిర్‌లైన్స్ ఒకదానితో ఒకటి పోటీపడకుండా ఇండిగో లాంటి బలమైన ఎయిర్‌లైన్స్‌కు పోటీనిచ్చేలా ఫ్లైట్లను నడపడం టాటా గ్రూప్ ముందు ఉన్న పెద్ద సవాల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air India, Airlines, Ratan Tata, Tata, Tata Group