జియో టెలికాం టారిఫ్ చార్జీల సవరణ...కొద్ది వారాల్లో అమల్లోకి వచ్చే అవకాశం

ధరల సవరణలతో డిజిటల్ విస్తృతి, డేటా వాడకంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండనున్నట్లు జియో ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా తన స్టేట్‌మెంటులో జియో ఇతర ఆపరేటర్ల తరహాలోనే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని తెలిపింది.

news18-telugu
Updated: November 19, 2019, 10:25 PM IST
జియో టెలికాం టారిఫ్ చార్జీల సవరణ...కొద్ది వారాల్లో అమల్లోకి వచ్చే అవకాశం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
టెలికాం ఆపరేటర్లు వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ ఇప్పటికే డిసెంబర్ 1 నుంచి టారిఫ్ చార్జీల పెంచుతూ నిర్ణయం తీసుకోగా, తాజాగా రిలయన్స్ జియో సైతం తగిన విధంగా చార్జీలను మరికొద్ది వారాల్లో సవరణపై సమాలోచనలు చేస్తోంది. అయితే ఈ పెంపుదలతో డిజిటల్ విస్తృతి, డేటా వాడకంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండనున్నట్లు జియో ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా తన స్టేట్‌మెంటులో జియో ఇతర ఆపరేటర్ల తరహాలోనే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని తెలిపింది. రెగ్యులేటరి నిబంధనలకు లోబడి టెలికాం పరిశ్రమను బలోపేతం చేసే చర్యల్లో తోడ్పాటు అందిస్తుందని, కస్టమర్ల విశ్వాసాన్ని కాపాడుతూనే, రానున్న చార్జీల సవరణల వల్ల డిజిటల్ విస్తృతి, డేటా వాడకంపై ప్రభావం చూపకుండా కృషి చేస్తామని పేర్కొంది. అలాగే రెగ్యులేటర్ నిర్ణయిస్తే చార్జీల సవరణ దృష్టి పెడతామని అందుబాటులో అందరికీ డేటా, డిజిటిల్ ఇండియా ప్రయత్నంలో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపింది.
First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...