AFTER TELANGANA NOW MAHARASHTRA AND WEST BENGAL ALSO INVITED TESLA ELON MUSK TO SETUP MANUFACTURING UNIT MK
Tesla Unit In India: మా రాష్ట్రానికి రండి మహాప్రభో..Teslaకు పలు రాష్ట్రాల ఆహ్వానం..తెలంగాణ బాటలో మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమబెంగాల్
Elon Musk
Tesla Unit In India: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా యజమాని ఎలోన్ మస్క్‌కు భారతదేశం నుంచి అనేక ఆహ్వానాలు అందుతున్నాయి. ఇప్పటకే కేటీఆర్ తెలంగాణలో టెస్లా కార్ల ఉత్పత్తిన చేపట్టాలని ఆహ్వానించగా, ఇప్పుడు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నుంచి ఆ తరహా ఆఫర్ లు ఎలాన్ మస్క్ కు వస్తున్నాయి.
Tesla Unit In India: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా యజమాని ఎలోన్ మస్క్‌కు భారతదేశం నుంచి అనేక ఆహ్వానాలు అందుతున్నాయి. ఇప్పటకే కేటీఆర్ తెలంగాణలో టెస్లా కార్ల ఉత్పత్తిన చేపట్టాలని ఆహ్వానించగా, ఇప్పుడు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నుంచి ఆ తరహా ఆఫర్ లు ఎలాన్ మస్క్ కు వస్తున్నాయి. మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జయంత్ పాటిల్ ఆదివారం ఒక ట్వీట్లో మహారాష్ట్రలో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఎలోన్ మస్క్‌ను ఆహ్వానించారు. జయంత్ ఆర్ పాటిల్ తన ట్వీట్లో "భారతదేశంలోని అత్యంత ప్రగతిశీల రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. భారతదేశంలో వ్యాపార విస్తరణకు మహారాష్ట్ర వైపు నుండి అవసరమైన అన్ని సహాయాలను మీకు అందిస్తాము. మహారాష్ట్రలో మీ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం." అని తెలిపారు.
మహారాష్ట్ర కన్నా ముందే తెలంగాణ కూడా ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించింది. భారత్‌లో టెస్లా సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్రంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఆహ్వానిస్తున్నామని తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. హాయ్ అలెన్, నేను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిని. భారతదేశం/తెలంగాణలో వ్యాపారాన్ని స్థాపించడంలో సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడటానికి టెస్లాతో భాగస్వామిగా ఉండటానికి మేము సంతోషిస్తాము. మా రాష్ట్రం సుస్థిర అభివృద్ధిలో ఛాంపియన్, భారతదేశంలో అగ్రశ్రేణి వ్యాపార గమ్యస్థానంగా ఉంది." అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక పశ్చిమ బెంగాల్ మంత్రి మహ్మద్ గులాం రబ్బానీ సైతం తమ రాష్ట్రంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని, తమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మంచి విజన్ ఉందని అన్నారు. ఇక పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు సైతం టెస్లాను పంజాబ్ లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు.
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీ టెస్లా.. భారత్‌లో తమ కార్లను విడుదల చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. భారతదేశంలో టెస్లా లాంచ్‌కు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా అని ట్విట్టర్‌లోని ఒక వినియోగదారు ఎలోన్ మస్క్‌ని అడిగారు. దానికి మస్క్ స్పందిస్తూ, " మా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. మేము ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాము." అని ట్వీట్ చేశారు.
పన్ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసిన మస్క్...
ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది, అయితే కొన్ని దేశీయ ఆటో కంపెనీలు దానిని వ్యతిరేకిస్తున్నాయి. ఇది దేశీయ తయారీ రంగంలో పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. టెస్లా ఈ సంవత్సరం భారత్ లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని యోచిస్తోంది, అయితే భారత్ లో పన్ను రేట్లు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయని మస్క్ పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే తాము ఏ ఆటోమేకర్‌కు అటువంటి దిగుమతి పన్ను మినహాయింపు ఇవ్వడం లేదని, టెస్లాకు పన్ను ప్రయోజనాలను ఇవ్వడం వల్ల భారతదేశంలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టే ఇతర కంపెనీలకు ఇది మంచి సందేశం కాదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.