EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు వరం... కొత్త పీఎఫ్ ఇలా లెక్కించాలి

EPFO Calculation | చివరి వేతనం రూ.30,000 ఉన్నా, రూ.40,000 ఉన్నా రూ.15,000 కిందే పెన్షన్‌ను లెక్కిస్తోంది ఈపీఎఫ్ఓ. ఇకపై చివరి వేతనం పరిగణలోకి తీసుకుంటే పెన్షన్‌దారులకు అధిక పెన్షన్ లభించనుంది.

news18-telugu
Updated: April 3, 2019, 3:45 PM IST
EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు వరం... కొత్త పీఎఫ్ ఇలా లెక్కించాలి
EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు వరం... కొత్త పీఎఫ్ ఇలా లెక్కించాలి
news18-telugu
Updated: April 3, 2019, 3:45 PM IST
ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నవారికి సుప్రీం కోర్టు అతిపెద్ద శుభవార్త చెప్పింది. ఏళ్లకేళ్లు కష్టపడి పనిచేసి రిటైరైన ప్రైవేట్ ఉద్యోగులు అధిక పెన్షన్ పొందే అవకాశం కల్పించింది సుప్రీం కోర్టు. రిటైర్మెంట్ సమయానికి వచ్చే యావరేజ్ బేసిక్ సాలరీ, డీఏపై పెన్షన్‌ను లెక్కించాలని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. కేరళ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం చివరి వేతనాన్ని పీఎఫ్ కోసం పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం మూలవేతనం+డీఏ కలిపి గరిష్టంగా రూ.15,000 మాత్రమే పరిగణలోకి తీసుకుంటోంది ఈపీఎఫ్ఓ. చివరి వేతనం రూ.30,000 ఉన్నా, రూ.40,000 ఉన్నా రూ.15,000 కిందే పెన్షన్‌ను లెక్కిస్తోంది ఈపీఎఫ్ఓ. ఇకపై చివరి వేతనం పరిగణలోకి తీసుకుంటే పెన్షన్‌దారులకు అధిక పెన్షన్ లభించనుంది. 2014 తర్వాత రిటైర్ అయినవారికి ఇది వర్తిస్తుంది.

Read this: Whatsapp tipline: వాట్సప్‌లో 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' ఫీచర్... ఫేక్ న్యూస్‌కు ఇలా చెక్ పెట్టండి

pension calculation, basic pension calculator, epf pension calculation, epf pension calculation formula 2019, pension calculation example in india, epf calculator, epf calculator excel, epf calculator app, monthly pf calculator, pf calculator 2019, epf calculation new method, pf calculation excel sheet, how to calculate pension, Supreme court dismissed EPFO plea, EPFO Kerala High Court order, EPFO news, EPFO pension news, epfo passbooks, EPFO pension rules, ఈపీఎఫ్ఓ పిటిషన్, పెన్షన్ రూల్స్, కేరళ హైకోర్టు తీర్పు, సుప్రీం కోర్టు తీర్పు, పెన్షన్, ఈపీఎఫ్ఓ పెన్షన్ నిబంధనలు, పెన్షన్ క్యాలిక్యులేటర్, పెన్షన్ లెక్కింపు, పెన్షన్ ఉదాహరణ



పెన్షన్ ఇలా లెక్కించాలి...


ఉద్యోగులు బేసిక్ సాలరీ, డీఏలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. సంస్థ యాజమాన్యం కూడా 12 శాతం జమచేయడం తప్పనిసరి. యజమాని వాటాను రెండు భాగాలుగా విభజిస్తారు. 3.67% ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తే, 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఖాతాలోకి వెళ్తుంది. కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగి చివరి వేతనం ఆధారంగా పీఎఫ్ లెక్కించాలి. పాత పద్ధతి, కొత్త పద్ధతి ప్రకారం రెండు ఉదాహరణలు చూద్దాం.



పాత పద్ధతి: ఓ ఉద్యోగి వేతనం పదవీ విరమణ సమయంలో రూ.50,000, సర్వీస్ 33 ఏళ్లు అనుకుంటే సర్వీస్ బోనస్ రెండేళ్లు కలిపి 35 ఏళ్లకు... రూ.15,000 మాత్రమే లెక్కిస్తారు. అంటే రూ.15,000 x 35/70= రూ.7,500 పెన్షన్ వస్తుంది.

కొత్త పద్ధతి: ఓ ఉద్యోగి వేతనం పదవీ విరమణ సమయంలో రూ.50,000, సర్వీస్ 33 ఏళ్లు అనుకుంటే సర్వీస్ బోనస్ రెండేళ్లు కలిపి 35 ఏళ్లకు కొత్త పద్ధతి ప్రకారం రూ.50,000 లెక్కించాలి. అంటే రూ.50,000 x 35/70= రూ.25,000 పెన్షన్ వస్తుంది.

ఈ లెక్కన కోర్టు తీర్పు ప్రైవేట్ వేతనజీవులకు భారీగా లాభం చేకూర్చనుంది.

Photos: ప్రపంచంలోనే పొడవైన బస్సు... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Google Apps: రెండు యాప్స్ ఆపేసిన గూగుల్... మీ ఫోన్‌లో ఉంటే డిలిట్ చేయండి

Link PAN: మీ పాన్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ఇలా లింక్ చేయండి

April Fool Prank: తన భార్య గర్భవతి అని ఫ్యాన్స్‌ని ఫూల్ చేసి విమర్శలపాలైన పాప్ స్టార్
First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...