పెరగనున్న పాప్ కార్న్ ధరలు.. 18శాతం జీఎస్టీ పరిధిలోకి..

తృణ ధాన్యాలు వేయించడం ద్వారా తయారు చేసినట్లు తమ తయారి విధానంలో పేర్కొందని, ఈ క్రమంలోనే పాప్‌కార్న్‌ను 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో చేర్చామని AAR క్లారిటీ ఇచ్చింది.

news18-telugu
Updated: June 26, 2020, 10:27 AM IST
పెరగనున్న పాప్ కార్న్ ధరలు.. 18శాతం జీఎస్టీ పరిధిలోకి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టైం పాస్‌ కోసం తినే స్నాక్స్‌లో పాప్ కార్న్ ముందు వరసలో ఉంటుంది. థియేటర్ల సినిమా చూస్తూ.. ఇంట్లో టీవీ చూస్తూ.. ఎక్కువ మంది ఇష్టంగా తినే ఐటమ్. ఐతే రెడీ టూ ఈట్ పాప్‌కార్న్ మార్కెట్లో విరివిగా దొరుకుతోంది. వాటిని తెచ్చుకొని గిన్నెలో వేడి చేస్తే చాలా వేడి వేడిగా క్రిస్పీ పాప్ కార్న్ రెడీ అవుతుంది. ఇకపై ఆ పాప్ కార్న్ ధరలు పెరగనున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు 5శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉన్న పాప్ కార్న్‌ ఇప్పుడు 18శాతం శ్లాబ్‌లో చేరింది. రెడీ టూ ఈట్ పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తామని గుజరాత్ జీఎస్టీ అడ్వాన్స్ రూలింగ్స్ (AAR) అథారిటీ స్పష్టం చేసింది.

సూరత్‌కు చెందిన జై జలారాం ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రెడీ టూ ఈట్ పాప్‌కార్న్ ఉత్పత్తి చేస్తుంది. ఐతే ఈ కంపెనీ యజమాని జె జలారామ్ తమ ఉత్పత్తులపై విధించే జీఎస్టీపై స్పష్టత కోసం ఏఏఆర్‌ను సంప్రదించగా.. పాప్‌కార్న్‌ ఉత్పత్తులు అన్ని కూడా 18 శాతం కిందకు వస్తాయని స్పష్టం చేసింది. ఐత నూనె, పసుపు, సుగంధ ద్రవ్యాలు మొదలైన పదార్థాలతో తయారు చేసే ఉత్పత్తులు అన్ని కూడా 5 శాతం పన్ను కిందకే వస్తాయని.. పాప్‌కార్న్‌పై కూడా అదే పన్నును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పాప్‌కార్న్‌కు కారం, ఉప్పు బాగా పట్టేందుకే ఆయిల్ కలుపుతామని చెప్పారు. అయితే అందుకు ఏఏఆర్ అంగీకరించలేదు. రెడీ టూ ఈట్ పాప్‌కార్న్‌ను తృణధాన్యాలుగా పరిగణించలేమని వెల్లడించింది.

రెడీ టూ ఈట్‌కు సంబంధించిన ప్యాక్డ్‌ నిల్వ ఆహార పదార్థాలన్నీ 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకే వస్తాయని AAR స్పష్టం చేసింది. తృణ ధాన్యాలు వేయించడం ద్వారా తయారు చేసినట్లు తమ తయారి విధానంలో పేర్కొందని, ఈ క్రమంలోనే పాప్‌కార్న్‌ను 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో చేర్చామని AAR క్లారిటీ ఇచ్చింది. కాగా, కొన్ని రోజుల క్రితం రెడీ టూ ఈట్ పరోటాను కూడా 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. చపాతీ, పరోటా వేర్వేరు అని.. చపాతీ రోటీ కిందకు రాదని కర్నాటక జీఎస్టీ అడ్వాన్స్ రూలింగ్స్ (AAR) అథారిటీ తెలిపింది. అది రెడీ టూ ఈట్ కిందకు వస్తుందని, అందుకే 18శాతం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
First published: June 26, 2020, 10:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading