Home /News /business /

AFTER OIL AND GAS NOW TV PRICES TO GO UP FROM APRIL KNOW HOW MUCH BA

ధరల పెరుగుదల జాబితాలో మరొకటి.. టీవీల రేట్లు పెరుగుతున్నాయ్.. ఎప్పటి నుంచి.. ఎంతో చూడండి.

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

దేశంలో LED టీవీల ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రేట్లు పెరగనున్నాయి. దీనికి కారణం ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు నెల రోజుల్లో 35 శాతం మేర పెరిగాయి.

    దేశంలో LED టీవీల ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రేట్లు పెరగనున్నాయి. దీనికి కారణం ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు నెల రోజుల్లో 35 శాతం మేర పెరిగాయి. ఇప్పటికే ఎల్ జీ కంపెనీ టీవీల ధరలను పెంచింది. మరో వైపు పానాసోనిక్, హయర్, థాంసన్ లాంటి కంపెనీలు కూడా టీవీల ధరలను పెంచడానికి ముహూర్తం ఫిక్స్ చేశాయి. ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచనున్నాయి. ‘ప్యానెల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీంతో టీవీల ధరలు కూడా పెంచక తప్పేలా లేదు. ఏప్రిల్ నుంచి ధరల్లో మార్పు వస్తుంది.’ అని పానాసోనిక్ ఇండియా , దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ చెప్పారు. అయితే, రేట్లు ఎంత మేర పెరుగుతాయనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి 5 నుంచి 7 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. మరోవైపు హయర్ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ మాట్లాడుతూ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు.

    ఓపెన్ సెల్ ప్యానెల్స్ అనేవి టీవీలకు చాలా ముఖ్యమైనవి. మొత్తం టీవీ తయారు చేయడానికి అయ్యే ఖర్చులో 60 శాతం కేవలం ఓపెన్ సెల్ ప్యానెల్స్‌కు ఖర్చవుతుంది. కంపెనీలు అన్నీ కూడా ఓపెన్ సెల్ దశలో ప్యానెల్స్‌ను దిగుమతి చేసుకుంటాయి. ఆ తర్వాత వాటిని అసెంబుల్ చేస్తాయి. ఆ తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేస్తాయి.

    ప్రస్తుతం భారత్‌లో 32 అంగుళాల టీవీలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉన్న ధరలను బట్టి చూస్తే ఏప్రిల్ 1 నుంచి వాటి ధరలు రూ.5వేల నుంచి రూ.6వేల వరకు పెరిగే అవకాశం ఉందని వీడియో టెక్స్ట్ గ్రూప్ డైరెక్టర్ అరుణ్ బజాజ్ చెప్పారు. కొన్నిటీవీల ధరలు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎల్ జీ కంపెనీ తమ టీవీ ప్యానెల్స్ ధరలు పెంచబోమని చెప్పింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Business, BUSINESS NEWS, MI LED TV, Smart TV, Xiaomi Mi TV

    తదుపరి వార్తలు