హోమ్ /వార్తలు /బిజినెస్ /

BSNL Offer: జియోకు పోటీగా బీఎస్​ఎన్​ఎల్ బంపరాఫర్.. ఈ యాన్యువల్ ప్లాన్​పై 90 రోజుల అదనపు వ్యాలిడిటీ..

BSNL Offer: జియోకు పోటీగా బీఎస్​ఎన్​ఎల్ బంపరాఫర్.. ఈ యాన్యువల్ ప్లాన్​పై 90 రోజుల అదనపు వ్యాలిడిటీ..

టెల్కో దిగ్గజం రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్​ఎన్​ఎల్​ ఓ సరికొత్త ఆఫర్​తో ముందుకొచ్చింది. రూ. 2545 ప్లాన్​పై 90 రోజుల అదనపు వ్యాలిడిటీని ప్రకటించింది.

టెల్కో దిగ్గజం రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్​ఎన్​ఎల్​ ఓ సరికొత్త ఆఫర్​తో ముందుకొచ్చింది. రూ. 2545 ప్లాన్​పై 90 రోజుల అదనపు వ్యాలిడిటీని ప్రకటించింది.

టెల్కో దిగ్గజం రిలయన్స్ జియోకు పోటీగా బీఎస్​ఎన్​ఎల్​ ఓ సరికొత్త ఆఫర్​తో ముందుకొచ్చింది. రూ. 2545 ప్లాన్​పై 90 రోజుల అదనపు వ్యాలిడిటీని ప్రకటించింది.

  ప్రభుత్వ రంగ టెలికాం(Telecom) సంస్థ భారత్​ సంచార్​ నిగమ్​ లిమిటెడ్ (BSNL​) వరుస ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల ఎయిర్​టెల్​(Airtel), జియో, వొడాఫోన్​ వంటి ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు నెలవారీ ప్లాన్ల (Monthly plans) ధరలను పెంచడంతో ఆయా యూజర్లను తన వైపు తిప్పుకునేలా వరుస ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా టెల్కో దిగ్గజం రిలయన్స్ జియోకు (Jio) పోటీగా బీఎస్​ఎన్​ఎల్​ ఓ సరికొత్త ఆఫర్​తో (New offer) ముందుకొచ్చింది. రూ. 2545 ప్లాన్​పై 90 రోజుల అదనపు వ్యాలిడిటీని ప్రకటించింది. న్యూ ఇయర్​ సందర్భంగా జియో తన వార్షిక ప్రీపెయిడ్​ ప్లాన్​ రూ. 2545 పై అదనంగా 29 రోజుల వ్యాలిటీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో జియోకు పోటీగా బీఎస్​ఎన్​ఎల్​ ఈ భారీ ఆఫర్​ ప్రకటించింది.

  అయితే రిలయన్స్​ జియో కేవలం 29 రోజుల వ్యాలిడిటీని పొడిగించగా.. బదులుగా, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఏకంగా 90 రోజుల అదనపు వ్యాలిడిటీని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. కాగా, గతంలో ఈ ప్లాన్​పై 60 రోజుల అదనపు వ్యాలిడిటీని బీఎస్​ఎన్​ఎల్​ అందించేది. ఇప్పుడు మరో 30 రోజుల అదనపు వ్యాలిడిటీ వర్తిస్తుందని బీఎస్​ఎన్​ఎల్​ ప్రకటనలో పేర్కొంది. దీంతో మొత్తంగా యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్​ రూ. 2,399పై యూజర్లకు ఏకంగా 455 రోజుల (15 నెలలు) వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ​

  How to Become Rich: ధనవంతులు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..


  ఉచితంగా ఈరోస్​ నౌ సబ్​స్క్రిప్షన్..​

  బీఎస్​ఎన్​ఎల్​ యాన్యువల్ ప్రీపెయిడ్​ ప్లాన్​ రూ. 2,399పై అదనపు వ్యాలిడిటీతో పాటు పలు ఆఫర్లను బీఎస్​ఎన్​ఎల్​ అందిస్తోంది. ఈ ప్లాన్​తో యూజర్లకు ప్రతి రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా, అన్‌లిమిటెడ్ వాయిస్​ కాల్స్​, ప్రతిరోజు 100 ఎస్​ఎమ్​ఎస్​లను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్​పై ప్రముఖ ఓటీటీ ఈరోస్​ నౌ ఉచిత సబ్​స్క్రిప్షన్​ కూడా లభిస్తుంది.

  ఈరోస్​ నౌ ఓటీటీలోని 12,000 సినిమాలు, ప్రీమియం ఒరిజినల్స్, మ్యూజిక్ వీడియోలు,​ కంటెంట్​ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. మరోవైపు, ఈరోస్ నౌ ద్వారా బీఎస్​ఎన్​ఎల్​ ట్యూన్స్, కంటెంట్‌కు ఉచిత యాక్సెస్‌ కూడా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ దేశంలోని అన్ని సర్కిల్‌లలో అందుబాటులో లేదు. ప్రస్తుతానికి బీఎస్​ఎన్​ఎల్​ హర్యానా సర్కిల్​లో మాత్రమే ఆఫర్​ వర్తిస్తుంది. త్వరలోనే అన్ని సర్కిళ్లలో ఆఫర్​ ప్రకటించే అవకాశం ఉంది.

  First published:

  Tags: BSNL, Business

  ఉత్తమ కథలు