• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • AFTER GAS PETROL AND DIESEL NOW MILK PRICE LIKELY TO INCERASE IN TELUGU STATES KNOW HOW MUCH BA GNT

సామాన్య జనంపై మరో బండ.. పెరగనున్న పాల ధరలు.. లీటర్‌పై ఎంతంటే..

సామాన్య జనంపై మరో బండ.. పెరగనున్న పాల ధరలు.. లీటర్‌పై ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

‘పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. గ్రామాల నుంచి పాల సేకరణ, దాన్ని ప్రాసెసింగ్ చేయడం, మళ్లీ ఆ ప్రాసెస్ చేసిన పాలను వినియోగదారులకు చేరవేయడానికి చాలా వరకు రవాణా వాహనాల మీద ఆధారపడాల్సి వస్తుంది. రేట్లు పెరగడం వల్ల అది భారంగా మారింది.’ అని చెప్పారు.

  • Share this:
    ఇప్పటికే ధరలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండడం లేదు. కిరాణా షాపులో వారం క్రితం కొన్న సామగ్రి రేటు మరో వారానికి మారిపోతోంది. ఇక నిత్యావసరాల ధరల గురించి చెప్పాల్సిన పనిలేదు. గ్యాస్ బండ రేటు భారీగా పెరిగింది. కరోనా లాక్ డౌన్ తర్వాత సుమారు రూ.230 వరకు గ్యాస్ ధర పెరిగినట్టు అంచనా. ఇక పెట్రోల్, డీజిల్ ధరల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. ఈ నెలలోనే వరుసగా 11 రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క రోజు కూడా తగ్గలేదు. దీనికి జనం మండిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జనం బయటకు చెప్పకపోయినా లోపల మండిపోతున్నారు. ఇప్పటికే ధరాఘాతంతో అల్లాడుతున్న జనాలకు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్. తాజాగా, పాల ధరలు పెరగనున్నాయి.

    పసివాళ్ళ నుండి పండు ముసలివారి వరకు త్వరగా జీర్ణం అవ్వడమే కాక అత్యంత పోషకవిలువలు కలిగిన పాలధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పాల ధర బహిరంగ మార్కెట్ లో లీటరు రూ.60 ఉండగా.. ఇప్పుడు డీజిల్ రేట్లు పెరగడంతో రవాణా ఛార్జీలు పెరుగడంతో ఆ భారం వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి అని పాల ఉత్పత్తి దారులు తెలియజేస్తున్నారు. డీజిల్ ధరలను అనుసరించి రవాణా ఛార్జీలు, పశువుల దాణా, సేకరించిన పాలను తరలించడానికి అయ్యే రవాణా ఛార్జీలు కలిపి తడిసి మోపెడవుతాయని, ఆ ఖర్ఛులు మొత్తం కలిపి పాల వినియోగదారులకు మరింత భారం కానుందని పాల డెైయిరీ యజమానులు తెలియజేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ డెయిరీ సంస్థ ప్రతినిధిని న్యూస్ 18 సంప్రదించింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ రేట్ల ప్రభావం తమ మీద బాగా పడిందని చెప్పారు. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. గ్రామాల నుంచి పాల సేకరణ, దాన్ని ప్రాసెసింగ్ చేయడం, మళ్లీ ఆ ప్రాసెస్ చేసిన పాలను వినియోగదారులకు చేరవేయడానికి చాలా వరకు రవాణా వాహనాల మీద ఆధారపడాల్సి వస్తుంది. రేట్లు పెరగడం వల్ల అది భారంగా మారింది. దీనికి తగినట్టు రేట్లు పెంచకపోతే సమస్య వస్తుంది. అందుకే రేట్లు పెంచకతప్పడం లేదు.’ అని ఆయన తెలిపారు.

    లీటర్ పాల మీద ఎంత వరకు ధరలు పెరగొచ్చనే అంశంపై ఆయన స్పందిస్తూ వీలున్నంత వరకు తక్కువగానే ఉంటాయని చెప్పారు. కనీసం లీటర్ మీద రూపాయి నుంచి రూ.2 వరకు పెరగొచ్చని చెప్పారు. ప్రైవేటు డైరీ కాబట్టి, అంతకు మించి పెంచినా ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చని, వినియోగదారులు బ్రాండ్ పాలను మార్చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

    పాల ప్యాకెట్లు కొనే వారి కంటే, ఇంటింటికీ వచ్చి పాలు పోసే వారి సంగతి చెప్పాల్సిన పనిలేదు. వారు లీటర్ కు రూ.70 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో రూ.80 కూడా తీసుకుంటున్నారు. అది కూడా నీళ్లు కలిపిన పాలు ఉంటున్నాయి. దీనిపై ఎవరైనా అడిగితే రెండు రోజులు చిక్కని పాలు పోస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ నీళ్లు కలిపిన పాలే వస్తున్నాయి. దీని వల్ల జనం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్యాకెట్ పాల రేట్లు కూడా పెరిగితే జనం మీద మరింత భారం పడుతుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు