హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax Dept: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ తర్వాత చేయాల్సిన పనులివే.. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు..

Tax Dept: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ తర్వాత చేయాల్సిన పనులివే.. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు..

Income Tax Returns

Income Tax Returns

Tax Dept: ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన 15 రోజుల తర్వాత తమ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరోసారి ధ్రువీకరించాలని చాలామందికి నోటీసులు వస్తున్నాయి. మరికొందరు రీఫండ్ రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలని చార్టెడ్ అకౌంటెంట్లు Moneycontrol.comకి చెప్పారు. అవేంటో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

గత ఆర్థిక సంవత్సరాని (Financial Year)కి సంబంధించిన ఆదాయ పన్ను (Income Tax) చెల్లించడానికి గడువు ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం లేట్ ఫీజుతో రిటర్న్ (ITR) ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశాక కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఐటీఆర్ దాఖలు చేశాక ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చే మెయిల్స్‌ను తప్పకుండా చెక్ చేయాలి. మీ రిటర్న్‌ ఇంకా ప్రాసెస్ చేయకపోతే లేదా మీ ఆదాయ పన్ను రీఫండ్‌లు ఇంకా రాకపోతే.. దానికి కారణాలను ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (Tax Department) మెయిల్ చేయవచ్చు. ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన 15 రోజుల తర్వాత తమ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరోసారి ధ్రువీకరించాలని చాలామందికి నోటీసులు వస్తున్నాయి. మరికొందరు రీఫండ్ రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలని చార్టెడ్ అకౌంటెంట్లు Moneycontrol.comకి చెప్పారు. అవేంటో చూద్దాం.

* రీఫండ్ ఫెయిల్యూర్

పన్ను చెల్లింపుదారులు చాలామంది ఇప్పటి వరకు రీఫండ్‌లను ఇంకా పొందలేదని ఫిర్యాదు చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ మారనప్పటికీ రీఫండ్ సమస్యల గురించి తమకు మెసేజ్‌లు వచ్చాయని చెప్పారు. ఆదాయ పన్ను శాఖ పరిధికి మించిన అంశాలే ఈ సమస్యకు కారణం కావచ్చు. అకౌంట్‌కు పాన్ కార్డ్ వివరాలు లింక్ చేయకపోవడం కారణంగా పేర్కొంటూ రీఫండ్ ఫెయిల్యూర్ నోటీసులు వస్తున్నాయి.

అయితే KYC రెన్యువల్ చేయకపోవడం వల్ల కూడా రీఫండ్ రాకపోవచ్చని చెబుతున్నారు CharteredClub.com వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా. పన్ను రిటర్న్‌లలో పేర్కొన్న మీ బ్యాంక్ అకౌంట్ సరైనదేనని ధ్రువీకరించడంతో పాటు మీ ఆధార్, పాన్ వివరాలు బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసి, KYC డాక్యుమెంటేషన్ చేస్తే ఈ సమస్యలు పరిష్కారమవుతాయని సూచిస్తున్నారు.

* చెల్లించిన పన్నులు ప్రతిబింబించడం లేదు

పన్నులు ఇంకా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నిస్తూ కొంతమందికి అధికారులు ఇమెయిల్‌లు పంపిస్తున్నారు. పన్నులు చెల్లించిన వారిలో కొంతమందికి కూడా ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయని, మనీకంట్రోల్ మాట్లాడిన కొందరు చార్టెడ్ అకౌంటెంట్లను తెలిపారు. అయితే ఇవి IT నోటీసులు కాదని, ఇమెయిల్ ద్వారా పంపిన సాధారణ ప్రశ్నలని మరికొందరు చెబుతున్నారు.

ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చేసే పన్ను చెల్లింపులు మీ ఫారమ్ 26 ASలో రిఫ్లెక్ట్ అవ్వడానికి రెండు రోజులు సమయం పడుతుంది. కానీ ఈ అసెస్‌మెంట్ ఇయర్‌లో.. 2022 జులైలో రిటర్న్‌లను దాఖలు చేయడానికి ముందు చెల్లించిన పన్నులు ప్రతిబింబించడం లేదు. పన్ను బకాయిలను క్లియర్ చేయమని వ్యక్తులకు నోటీసులు వస్తున్నాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రిటర్న్‌లను రీప్రాసెసింగ్ కోసం పంపాలని బాత్రా చెప్పారు.

* పెట్టుబడులను మళ్లీ నిర్ధారించండి

మీరు పెట్టుబడులపై డిడక్షన్స్ లేదా రిబేట్‌ను తప్పుగా క్లెయిమ్ చేసి ఉంటే, రిటర్న్‌లో పేర్కొన్న పెట్టుబడి మొత్తం సరైనదేనా కాదా అని మళ్లీ నిర్ధారించమని మీకు ఇమెయిల్ వచ్చే అవకాశం ఉంది. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడానికి, డిడక్షన్స్ క్లెయిమ్ చేసిన పెట్టుబడులు కచ్చితమైనవో కాదో మళ్లీ నిర్ధారించడానికి ఇలా ఇమెయిల్ పంపిస్తారు.

ఇది కూడా చదవండి : ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండొచ్చా.. పాన్ కార్డు పోతే ఏం చేయాలి..?

ఒక నిర్దిష్ట సంవత్సరంలో దాఖలు చేసిన రిటర్న్.. మునుపటి సంవత్సరాల్లో అదే పన్ను చెల్లింపుదారులు సెట్ చేసిన నమూనాలకు సరిపోకపోతే, పన్ను చెల్లింపుదారులకు ఆటోమేటిక్‌గా ఇమెయిల్ వస్తుంది, మరింత సమాచారం కోసం అడుగుతుంది.

ఉదాహరణకు, మీరు సెక్షన్ 80C బాస్కెట్ కింద చాలా తక్కువ పెట్టుబడులను క్లెయిమ్ చేసి, ఇప్పుడు సెక్షన్ 80C పరిమితి రూ. 1.5 లక్షలను పూర్తి చేసినట్లు క్లెయిమ్ చేస్తే, మీకు ఆటోమెటిక్‌గా ఈ మెయిల్‌ రావచ్చు. ‘ఇలాంటి సందర్భాల్లో సంబంధిత డాక్యుమెంట్స్‌ను సమర్పించకపోతే.. 300 శాతం వరకు పన్ను ఎగవేత పెనాల్టీ విధించవచ్చు.

అసెస్సింగ్ అధికారి పెనాల్టీ ప్రొసీడింగ్స్ ప్రారంభించవచ్చు’ అని బాత్రా అభిప్రాయపడ్డారు. కాబట్టి సంబంధిత డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయండి. కనీసం మూడు సంవత్సరాల పాటు వాటిని భద్రపరచండి. ఏదైనా కారణంతో మీరు ఇలాంటి ఇమెయిల్‌ను తనిఖీ చేయకుంటే, ఐటీ విభాగం నుంచి వచ్చిన అన్ని పాత మెయిల్స్‌ను చెక్ చేయడం మంచిది.

* విదేశీ ఆస్తులను వెల్లడించండి

విదేశీ ఆస్తులున్న వ్యక్తులకు అధికారులు ఇలాంటి నోటీసులు పంపుతున్నారు. విదేశీ ప్రయాణ సమాచారం లేదా విదేశీ ఆస్తులపై పన్నులు ఎగవేస్తున్న పన్ను చెల్లింపుదారులను వెలికితీసేందుకు అధికారులు ఇలాంటి వారి రెసిడెన్షియల్ స్టేటస్‌ను గుర్తించవచ్చు. “మీరు విదేశాలలో పని చేస్తూ, దేశంలో ఇంతకుముందు బ్యాంకు అకౌంట్ కలిగి ఉంటే.. లేదా మీరు ఎమ్మెన్సీ కంపెనీలో పనిచేసినట్లు ఇంటర్నేషనల్లీ లిస్టెడ్ కంపెనీల ఉద్యోగుల స్టాక్ ఆప్షన్‌లను స్వీకరిస్తే.. మీరు వీటిని ఎలా సంపాదించారనే వివరాలు తెలియజేయాలి.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచి స్టార్ట్ చేసే క్రియేటివ్ బిజినెస్ ఐడియా.. వేలల్లో లాభాలు..

ఈ విషయాల్లో ఎలాంటి తప్పు జరగలేదని మీరు ధ్రువీకరించాలి. అంటే సంబంధిత వివరాలు అన్నింటినీ మీ పన్ను రిటర్న్‌లో పేర్కోవాలి. విక్రయ సమయంలో మూలధన లాభాలతో పాటు, ఈ అంతర్జాతీయ ఈక్విటీల నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయాన్ని కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ షెడ్యూల్ కింద ప్రకటించాల్సి ఉంటుంది” అని TaxSpanner.com సహ వ్యవస్థాపకుడు సుధీర్ కౌశిక్ చెప్పారు.

* పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలి?

ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చే ఎలాంటి నోటీసులు లేదా ఇమెయిల్‌లను అయినా తేలికగా తీసుకోకండి. ఈ విభాగం నుంచి మీకు మెయిల్స్ నిరంతరం వస్తూనే ఉండవచ్చు. అందుకని అవన్నీ ఉపయోగం లేనివిగా భావించకూడదు. అధికారులు లేవనెత్తిన సమస్యలను విస్మరించడం కంటే వెంటనే పరిష్కరించడం ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Income tax, ITR, ITR Filing

ఉత్తమ కథలు