House Rent Allowance | కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఉద్యోగులకు తీపికబురు అందించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు (Employees) ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం డీఏను 4 శాతం మేర పెంచేసింది. దీంతో డియర్‌నెస్ అలవెన్స్ అనేది 38 శాతానికి చేరింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది.
మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) త్వరలోనే పెరగనుందని తెలుస్తోంది. దీని వల్ల ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. కేంద్ర కేబినెట్ ఎలాగైతే డియర్‌నెస్ అలవెన్స్ పెంచిందో.. అలాగే హెచ్‌ఆర్ఏను కూడా పెంచనుంది. ప్రభుత్వం ఎప్పుడైనా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీపావళి కల్లా ముందుగానే ప్రభుత్వం హెచ్ఆర్ఏను పెంచొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి.
కారు కొంటే రూ.లక్ష తగ్గింపు.. కంపెనీ బంపరాఫర్!
కేంద్ర ప్రభుత్వం 2021లో హెచ్ఆర్ఏ పెంచింది. అదే సంవత్సరంలో డీఏ కూడా 28 శాతానికి చేరింది. ఈ ఏడాది ఇటీవలనే డియర్‌నెస్ అలవెన్స్ పెరిగింది. 34 శాతం నుంచి 38 శాతానికి చేరింది. అందువల్ల ఈసారి కూడా హెచ్ఆర్ఏ పెరగొచ్చని చాలా మంది ఆశావహంగా ఉన్నారు. అయితే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టం.
ఎస్‌బీఐ శుభవార్త.. లోన్ తీసుకునే వారికి కేక పుట్టించే ఆఫర్లు!
ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండేచర్ ప్రకారం హెచ్ఆర్ఏ ఎంత పెరగాలనే దానికి ఒక లెక్క ఉంటుంది. 2017లోనే ఈ అంశానికి సంబంధించి రూల్స్ అమలులోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం చూస్తే.. డియర్‌నెస్ అలవెన్స్ అనేది 25 శాతానికి దాటితే.. అప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్‌ను కూడా సవరించాల్సి ఉంటుంది. 7వ వేతన సంఘం ప్రకారం.. ఎక్స్ కేటగిరిలోని పట్టణాల్లో నివసించే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 27 శాతంగా ఉండాలి. అలాగే వై కేటగిరిలోని పట్టణాల్లోని ఎంప్లాయీస్‌కు మూల వేతనంలో 18 శాతంగా ఉండాల్సిందే. ఇక జెడ్ కేటగిరిలోని పట్టణాల్లో నివసించే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అనేది బేసిక్ వేతనంలో 9 శాతంగా ఉంటుంది. అయితే ఈ 3 కేటగిరిల్లోని పట్టణాల్లో నివసించే ఉద్యోగులకు కనీస హెచ్ఆర్ఏ వరుసగా రూ. 5400గా, రూ. 3600గా, రూ. 1800గా నిర్ణయించారు.
మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. ఎక్స్ కేటగిరిలోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 4 నుంచి 5 శాతం వరకు పెరగొచ్చు. వై కేటగిరిలోని ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు 2 శాతంగా ఉండొచ్చు. ఇక జెడ్ కేటగిరిలోని వారికి హెచ్ఆర్ఏ పెంపు ఒక శాతంగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు రూ. 25 వేల బేసిక్ వేతనం ఉన్న ఒక ఉద్యోగికి ప్రస్తుతం హెచ్ఆర్ఏ 27 శాతంగా ఉంది. 4 శాతం పెంపు తర్వాత చూస్తే ఇది 31 శాతం అవుతుంది. ఇప్పుడు హెచ్ఆర్ఏ రూ.7750 అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central govt employees, DA Hike, Dearness allowance, Employees, Hra, Salary Hike