దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల (petrol and diesel rates) తగ్గింపుపై చర్చ సాగుతున్న నేపథ్యంలో (Petrol price in India) పంజాబ్ ప్రభుత్వం (Punjab government) కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో పెట్రోల్ ధరను రూ.10, డీజిల్ ధరను రూ.5 తగ్గిస్తున్నట్లు (Punjab cut Fuel prices) పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ (charan jeeth singh chhanni) ప్రకటించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఈ స్థాయిలో తగ్గించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఇదొక్కటే కావడం గమనార్హం. తగ్గించిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
NDA పాలిత రాష్ట్రాలు..
కేంద్రం (Centre) పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తూ తీసుకొన్న నిర్ణయంతో NDA పాలిత రాష్ట్రాలు నవంబర్ 3, 2021 బుధవారం పెట్రోల్ మరియు డీజిల్‌పై వాల్యూ ఆడెడ్ టాక్స్ (value added tax) తగ్గించాయి. అస్సాం ప్రభుత్వం బుధవారం పెట్రోల్ మరియు డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని రూ. 7 తగ్గించింది. బీహార్ ప్రభుత్వం కూడా పెట్రోల్‌పై వ్యాట్‌ను రూ. 1.30, డీజిల్‌పై రూ. 1.90 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు రూ.7 తగ్గించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఖజానాకు రూ.2,100 కోట్ల నష్టం వాటిల్లుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై బుధవారం ట్వీట్ (tweet) చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.95.50, డీజిల్ ధర రూ.81.50 ఉంటుందని ఆయన తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు.
కేంద్రం (Centre) పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించిన దాదాపు మూడు రోజుల తర్వాత పంజాబ్ ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గత 70 ఏళ్లలో ధరలు ఈ స్థాయిలో తగ్గించడం ఇదే ప్రథమమని చరణ్‌జిత్ చన్నీ వెల్లడించారు ముఖ్యమంత్రి చన్నీ. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే.. తమ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గువగా ఉన్నట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీతో పోలిస్తే.. రూ.9 చౌకకే పెట్రోల్ (petrol) లభిస్తున్నట్లు వివరించారు.
We have decided to decrease petrol and diesel prices by Rs 10 per litre and Rs 5 per litre, respectively, to be effective from midnight today: Punjab CM Charanjit Singh Channi pic.twitter.com/Q3PP1scPeo
— ANI (@ANI) November 7, 2021
మరికొద్ది నెలల్లో పంజాబ్ (Punjab)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే.. ఈ ఆయిల్ వాడితే చాలు.. జుట్టు బలంగా అవుతుంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diesel price, Petrol Price, Punjab