Gold Rate: అక్షయ తృతీయ ముగిసింది... బంగారం ధర పెరిగింది

Gold Rate Today | స్థానిక నగల వ్యాపారులు కూడా కొనుగోళ్లు పెంచడంతో పాటు, మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధంతో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావించడం బంగారం ధర పెరగడానికి కారణం.

news18-telugu
Updated: May 8, 2019, 6:38 PM IST
Gold Rate: అక్షయ తృతీయ ముగిసింది... బంగారం ధర పెరిగింది
Gold Rate: అక్షయ తృతీయ ముగిసింది... బంగారం ధర పెరిగింది (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 8, 2019, 6:38 PM IST
దేశమంతా మే 7న అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకొంది. సెంటిమెంట్ ప్రకారం అనేకమంది ఈ రోజున బంగారం కొన్నారు. అక్షయ తృతీయ మరుసటి రోజున బుధవారం నాడు బంగారం ధరలు పెరగడం విశేషం. 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ప్రస్తుతం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,850 కాగా, 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.32,680. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.26,400.

Read this: Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొన్నారో తెలుసా?

స్థానిక నగల వ్యాపారులు కూడా కొనుగోళ్లు పెంచడంతో పాటు, మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధంతో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావించడం బంగారం ధర పెరగడానికి కారణం. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 1,288.20 డాలర్లకు, ఔన్స్ వెండి ధర 14.99 డాలర్లకు పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా రూ.100 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.38,220. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు పెంచడమే వెండి ధర పెరగడానికి కారణం. 100 వెండి నాణేలను రూ.79,000 ధరకు కొని రూ.80,000 ధరకు అమ్మారు.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?



ఇవి కూడా చదవండి:

బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Loading...
Android Q: ఆండ్రాయిడ్ 10 క్యూ రిలీజ్ చేసిన గూగుల్... ఫీచర్స్ ఇవే

LIC Policy: ఏడాదికి రూ.100 ప్రీమియంతో ఎన్నో లాభాలు
First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...