హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Tech IPO: 20 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా నుంచి మరో ఐపీఓ... ఇన్వెస్టర్లకు పండగే

Tata Tech IPO: 20 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా నుంచి మరో ఐపీఓ... ఇన్వెస్టర్లకు పండగే

Tata Tech IPO: 20 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా నుంచి మరో ఐపీఓ... ఇన్వెస్టర్లకు పండగే
(ప్రతీకాత్మక చిత్రం)

Tata Tech IPO: 20 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా నుంచి మరో ఐపీఓ... ఇన్వెస్టర్లకు పండగే (ప్రతీకాత్మక చిత్రం)

Tata IPO | ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న టాటా టెక్ ఐపీఓ (Tata Tech IPO) వచ్చేస్తోంది. సెబీ దగ్గర డీఆర్‌హెచ్‌పీ ఫైల్ చేసింది టాటా టెక్నాలజీస్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

టాటా గ్రూప్ నుంచి 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) రాబోతోంది. టాటా మోటార్స్ సబ్సిడరీ అయిన టాటా టెక్నాలజీస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) దగ్గర ఐపీఓ ద్వారా డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్. ఈ ఐపీఓ ద్వారా టాటా టెక్నాలజీస్ 95.71 మిలియన్ షేర్లను అమ్మబోతోంది. అందులో టాటా మోటార్స్‌కు చెందిన 81.13 మిలియన్ షేర్స్, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ పీటీఈకి చెందిన 9.72 మిలియన్ షేర్స్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1కి చెందిన 4.86 మిలియన్ షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా మోటార్స్ వాటాలు 74.69 శాతం, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ పీటీఈ వాటాలు 7.26 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1 వాటా 3.63 శాతం ఉన్నాయి.

టాటా టెక్నాలజీస్ గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు టర్న్‌కీ సొల్యూషన్‌లతో సహా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డిజిటల్ సొల్యూషన్స్‌ని అందించే గ్లోబల్ ఇంజనీరింగ్ సేవల సంస్థ. ఏరోస్పేస్, రవాణా, నిర్మాణాల భారీ యంత్రాలు లాంటి ఇతర పరిశ్రమలలో క్లయింట్లకు కూడా సేవలు అందిస్తోంది. టాటా మోటార్స్ లిమిటెడ్ టాటా టెక్నాలజీస్ ప్రమోటర్.

Railway Rules: రైలులో రాత్రి పూట ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గుర్తుంచుకోండి

రెండు దశాబ్దాల తర్వాత

రోజూ ఇంట్లో వాడే ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ సేవల వరకు టాటా గ్రూప్‌లో అనేక కంపెనీలు ఉన్న సంగతి తెలిసిందే. టాటాల నుంచి దాదాపు 20 ఏళ్ల తర్వాత ఐపీఓ వస్తుండటం విశేషం. 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత దేశీయ మార్కెట్‌లలో పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చిన మొదటి టాటా గ్రూప్ కంపెనీ ఇదే.

టాటా టెక్నాలజీస్ ఫైల్ చేసిన డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్‌తో సహా, సెల్లింగ్ షేర్‌హోల్డర్‌లు సంపాదించిన ఒక్కో ఈక్విటీ షేరుకు సగటు ఈ కింది విధంగా ఉంది.

టాటా మోటార్స్ లిమిటెడ్: ఒక షేర్‌కు రూ.7.40 చొప్పున మొత్తం 303,006,000 ఈక్విటీ షేర్లు.

ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్: ఒక షేర్‌కు రూ.25.10 చొప్పున మొత్తం 29,445,010 ఈక్విటీ షేర్లు.

టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1: ఒక షేర్‌కు రూ.25.10 చొప్పున మొత్తం 14,722,500 ఈక్విటీ షేర్లు.

SBI Account: మీ ఎస్‌బీఐ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయా? కారణమిదే

టాటా టెక్ ఐపీఓ ఫైనాన్షియల్స్

డీఆర్‌హెచ్‌పీలోని సమాచారం ప్రకారం డిసెంబర్ 31, 2022తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కార్యకలాపాల ద్వారా రూ.3011.7 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. 2021లో అదే కాలానికి ఆదాయం రూ.2607.3 కోట్లు. ఇక కంపెనీ డిసెంబర్ 31, 2022తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి పన్ను తర్వాత లాభం రూ.407.4 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.331.3 కోట్లు. ఇక 31 మార్చి 2022తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.3529.6 కోట్లు కాగా, ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ. 645.6 కోట్లు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రూ.437 కోట్లు.

ఉద్యోగులు, డెలివరీ సెంటర్స్

టాటా టెక్నాలజీ సీఈఓగా వారెన్ హారిస్ ఉన్నారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 11,081. అందులో ఫుల్ టైమ్ ఉద్యోగులు 10,161 కాగా, కాంట్రాక్ట్ ఉద్యోగులు 920. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని వేర్వేరు ఫెసిలిటీస్ నుంచి క్లైంట్లకు సేవలు అందిస్తోంది.

First published:

Tags: Tata Group, Tata Motors, Tata Tech IPO

ఉత్తమ కథలు